మార్కాపురం: తర్లుపాడు మండలంలోని సీతానాగులవరంలో వీరాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగాయి. ఆరు పండ్ల విభాగంలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన బీరంబుల్స్, జూపల్లి ప్రభాకర్‌రెడ్డి ఎడ్ల జత 5265.4 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని, ఇదే ఎడ్ల జత 4852.1 అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతిని, మార్కాపురం జిల్లా కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన డీవీకె బుల్స్, లాయర్ కృష్ణ ఎడ్ల జత 4506 అడుగులు లాగి తృతీయ బహుమతిని సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన బీహెచ్‌కె బుల్స్, విజయలక్ష్మి నాయుడు ఎడ్ల జత 4 వేల అడుగులు లాగి నాల్గవ బహుమతిని, మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన ముడియాల వెంకటేశ్వరరెడ్డికి చెందిన ఎడ్ల జత 2018 అడుగులు లాగి 5వ బహుమతిని సాధించినట్లు తెలిపారు.


