
కొన్ని విషయాలు పిల్లలకు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. సరైనదే అయినా..ప్రాణాలను పణంగా పెట్టేంత డేరింగ్ నిర్ణయాలు గురించి చెప్పకపోవడమే మేలు. సురక్షితమైన చర్యలు తీసుకుంటే పర్లేదు. జరగరానీ నష్టం జరిగితే ఇక అంతే పరిస్థితులు. ఇక్కడ అలాంటి భయానక పేరెంటింగ్ టీచింగ్‌కి సంబంధించిన ఘటనే చోటుచేసుకుంది. ఆ వీడియో చూస్తే..మరీ ఈ రేంజ్‌లో ధైర్యం విలువ గురించి నేర్పించాలా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..
ఆ వీడియోలో ఓ ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గారెట్ గీ తన కొడుకుని పెద్ద పర్వతం మీద నుంచి నదిలోకి దూకేయమని ప్రోత్సహిస్తాడు. మొదట ఆ పిల్లవాడు భయంతో వెనకడుగు వేస్తాడు. ఆ తర్వాత తండ్రి మాటలకు కాస్త ప్రేరేపించబడినా..దూకే సాహసం చేయలేకపోయాడు. దాంతో చివరికి తండ్రే అతడిని ఎత్తుకుని విసిరేస్తాడు. పాపం ఆ పిల్లవాడు భయంతో నాన్న అని అరవడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటం చూడొచ్చు.
ఆ తర్వాత తండ్రి వెంటనే దూకేసి అతడిని పట్టుకుని ఒడ్డుకి వచ్చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పడం మరీ ఈ రేంజ్‌లోనా అంటూ ఫైర్ అయ్యారు. పిల్లలందరూ ఒకేలా ఉండరని, కొందరూ చాలా పిరికిగా ఉంటారంటూ హితవు పలికారు.
నెమ్మదిగా ధైర్యాన్ని నూరిపోస్తూ..స్వతహాగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలే తప్ప ప్రాణాలకే ముప్పు వాట్లిలే ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు తగదు అని సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ గీకి హితవు పలికారు. అందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేగా పిల్లలకు భయం పోగొట్టాలంటే మరి ఇంతలా నేర్పించాలా అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అయితే గీ మాత్రం తల్లిదండ్రులుగా తమ ఉద్దేశ్యాలు వేరని, తాము ప్రేమగా జాగ్రత్తగా పిల్లలను చూసుకోగలమని తనదైన శైలిలో కౌంటరిచ్చాడు ఇన్‌ఫ్లుయెన్సర్ గీ.
(చదవండి: రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!)