
కార్లుపైకి లేచి దొర్లుకుంటూ వచ్చే భయానక ప్రమాదాలు సినిమాల్లోనే చూస్తుంటాం. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలైతే ఏ రైంజ్‌లో కార్లు పైకి లెగుస్తాయో తెలిసిందే. అచ్చం అలాంటి భయానక ప్రమాదం మన కళ్లముందు జరిగి..పొరపాటు ఆ ఘటనలో చిక్కుకుంటే అమ్మో..! ఏ జరుగుతుందో అన్నది ఊహకే అందనిది. అలాంటి యాక్సిడెంట్ బారినేపడి జస్ట్ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు. చెప్పాలంటే చావు అంచులదాక వెళ్లొచ్చాడని చెప్పొచ్చు.
ఈ ఘటన అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జాన్సన్ అనే వ్యక్తి బ్రాడీ గేటు వద్ద తన ట్రక్కును పార్కింగ్ చేసి, విండోని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక కారు పల్టీలు కొడుతూ అతడివైపుకి దూసుకువస్తుంది. రెప్పపాటులో స్పందించి తప్పించుకున్నాడు లేదంటే ఆ కారుకింద నుజ్జు నుజ్జు అయ్యి ఉండేవాడు.
మృత్యువుని చాలా దగ్గర నుంచి చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేసిన జాన్సన్ అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలసిపోయావు. అంతటి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ కారులోని డ్రైవర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడని కనుక్కోవడానికి వెళ్లడం విశేషం. మితిమీరిన వేగంతో వచ్చిన డ్రైవర్‌ని తప్పుపట్టక, అతడి బాగోగులు గురించి ఆలోచించి.. తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు జాన్సన్.
ఈ వీడియోని చూసిన నెటజన్లు కూడా సదరు కారు డ్రైవర్‌పై విమర్శలు ఎత్తడమే గాక, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ఉద్దేశిస్తూ..బ్రో నువ్వు మాములు లక్కీవి కాదు అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.
WATCH: Like an action movie… A man cleaning his windshield at a Nebraska gas station dodges an out-of-control car that flips on its side. He suffered only minor injuries. The speeding driver faces multiple citations.
📹: Lincoln County Sheriff’s Office pic.twitter.com/Yfg7qgNMHU— John-Carlos Estrada 🎙️ (@Mr_JCE) September 17, 2025
(చదవండి: ప్రకృతి సోయగం..! ఆహ్లాదం, ఆనందం..)