
సాయంకాలాన.. సాగర తీరాన అన్నట్లు.. ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది.. నగరంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన హారి్టకల్చర్ ఎక్స్‌పో.. ప్రదర్శనలో వివిధ ప్రాంతాలకు చెందిన నర్సరీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో పలు రకాల ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్స్ సందర్శకులను అలరిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయి. దీంతో పాటు ఈ ఎక్స్‌పోలో మనసుదోచే అక్వేరియం మోడల్స్, అందులో పెంచుకునే వివిధ రకాల చేపలు, అదే విధంగా గాజు, పింగాణి పాత్రలు, అందమైన ఇంటీరియర్స్, బాల్కనీని అలంకరించే పలు డెకరేటివ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇండోర్ ప్లాంట్స్‌లో ప్రధానంగా చెప్పుకునేది లక్కీ బాంబు ప్లాంట్. ఇది ఒక గాజు పాత్రలో నీరు, రంగు రంగు రాళ్ల మధ్య పెరిగే ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారు. మనం ఎవరికైనా పుట్టిన రోజు, స్వాగతం పలుకుతూ ఇచ్చేందుకు పిల్టోనియా అనే గిఫ్టింగ్ ప్లాంట్ ఎంతో ఆకర్షణీంగా కనిపిస్తుంది. దీనిని ఆఫీస్ టేబుల్‌పై, ఇంట్లోనూ పెట్టుకోవచ్చు.
కాక్టస్ ఫ్యామిలీకి చెందిన ఇండోర్ ప్లాంట్స్ నారింజ, ఎరుపు వర్ణంలో ఎంతో అందంగా ఉంటాయి. తక్కువ నీటిని తీసుకొని పెరిగే ఈ మొక్కలు ఇంట్లో ఎంతో అలంకరణగా ఉంటాయి.
స్నేక్ ప్లాంట్‌గా పిలుచే ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫయ్యర్‌గా పనిచేస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మన ఇంట్లోని గాలని శుద్ధి చేస్తుంది. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది.
ఇంట్లో వాస్తు దోషం, ధన అభివృద్ధి కలుగుతుందనే నమ్మకంతో ఇండోర్‌లో జెడ్ ప్లాంట్ మొక్కను
ఎక్కువగా పెంచుకుంటారు. ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం.
వాటర్ సేవింగ్ ప్లాంట్స్‌గా పిలువబడే సకులెట్స్ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడానికి ఎంతో మంది ఇష్టపడతారు. వీటిని ఇంటి గుమ్మం వద్ద స్వాగతం పలికే మొక్కలుగా, నెగిటివిటీని పాజిటివిటీగా మార్చే మొక్కలుగా పిలుస్తుంటారు. నవంబర్ నెలలో వీటికి పూచే పూలు వివిధ రంగుల్లో ఆకర్షిస్తాయి.
రణపాల ఈ మొక్క ఆకులు తరచూ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, రాకుండా అరికట్టేందుకు అవకాశముంటుంది.
మింట్ తులసి ఈ మొక్క ఆకును రోజు ఒకటి తీసుకుంటే మౌత్ ప్రెష్‌నగర్‌గా పనిచేస్తుంది. నోట్లో, గొంతులో ఇన్‌ఫెక్షన్స్ వంటి వాటిని కొంత వరకూ అరికట్టవచ్చు.
లావెండర్ మాసుపత్రి ఈ మొక్క ఇంట్లో ఉంటే దొమల నివారణకు ఉపయోగపడుతుంది. అందే ఈ మొక్కను మస్కిటోఫ్రెనర్‌గా పిలుస్తారు. వీటితో పాటు 40కి పైగా రాకాల బోన్సాయి మొక్కలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఇంట్లో అలంకరణగా అమర్చుకోవచ్చు. ఆక్వేరియంలో చిన్న పాటి దట్టమైన అడవిని తలపించే విధంగా గాజు, పింగాణి పాత్రల్లో అమర్చిన ఫారెస్ట్ ప్రేమ్‌లు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. వీటికి నెలలో ఒక్కసారి వాటర్ స్ప్రే చేస్తే చాలు నెల మొత్తం ఇంట్లో ఎంతో అందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతాయి.
ఇంటి పెరట్లోనే మెడిసిన్..
మొక్కలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. వాము చెట్టు ఈ మొక్క ఆకులు తరచూ తీసుకుంటే దగ్గు, ఆయసం వంటి వాటిని అరికట్టేందుకు అవకాశముంటుంది.