పిల్లల కోసం కన్నవాళ్లు ఎంతైన కష్టపడతారు. ఏం చేయడానికైనా వెనుకాడరు. అలానే ఈ తండ్రి తను కుమారుడు కెరీర్ కోసం చేస్తున్న పని అందర్నీ ఆలోచింప చేసేలా ఉండటమే గాదు, అందరి హృదయాలను తాకింది. మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నించే ఎంబీఏ స్టూడెంట్స్‌కి ఇవి గొప్ప పాఠాలు.
ఒక క్యాబ్‌డ్రైవర్ తన వాహనాన్ని మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్‌గా మార్చాడు. వాట్ అనుకోకండి అసలు కథలోకి వెళ్దాం. రోజువారిగా ప్రయాణీకులను డ్రాప్ చేసి వారితో సంభాషిస్తు..తన కుమారుడి కెరీర్‌కు తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నాడు.
అదికూడా సాంకేతిక సాయంతో. దీన్ని గమనించిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ దివ్యుషి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆమె క్యాబ్ డ్రైవర్ సీటుకి అటాచ్ చేసిన క్యూర్ కోడ్‌ని చూసి డిజిటల్ చెల్లింపు అనుకుందామె. అదే విషయం డ్రైవర్‌ని అడగగా..ఇది చెల్లింపులకు సంబంధించినది కాదని, తన కొడుకు స్వయంగా తయారు చేసుకున్న రాప్ సంగీతాన్ని ప్రదర్శించే యూట్యూబ్ ఛానెల్ ప్రత్యక్ష లింక్‌ని సమాధానమిస్తాడు.
ఎలాంటి అధికారిక విద్య నేపథ్యం లేకపోయినా..ఇతడి ఆలోచన తీరుకి దివ్యుషి ఇంప్రెస్ అయ్యింది. ప్రతి ప్రయాణికుడిని ఎక్కించుకుంటూ..దీని గురించి వాళ్లకి చెబుతూ..కుమారుడి డిజిటల్ కంటెంట్‌ని పైసా ఖర్చు లేకుండా ప్రమోట్ చేస్తున్నాడాయన అని రాసుకొచ్చింది పోస్ట్‌లో దివ్యుషి.
పరిమితమైన వనరులతో తను చేయగలిగింది చేస్తున్న ఈ తండ్రి సాయం నెటిజన్లు హృదయాలను గెలుచుకుంది. అంతేగాదు స్థానిక ట్యాక్సీలు డిజిటల్ విజయానికి లాంచ్‌ప్యాడ్‌లా ఉంటాయని ఇప్పుడే తెలిసిందని మరికొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: మన వంటకం దోసె..బ్రిటిష్ చెఫ్‌ని ఎంతలా మార్చేసింది..!)


