
భారతీయవ్యక్తిని పెళ్లాడటంతోనే ఇంతలా మారిపోతానని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా ఈ మార్పుని అస్సలు ఊహించలేదంటోంది ఓ విదేశీ మహిళ. చాలామంది విదేశీ వనితలు భారత్ అబ్బాయిలను పెళ్లాడి, ఇక్కడి కట్టుబొట్టుకి ఆకర్షితులై తమ లైఫ్‌స్టైల్‌నే మార్చుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల కోవలోకి తాజాగా ఈ ఉక్రెయిన్ మహిళ కూడా చేరింది. ఎవరామె? అంతలా ఏం మార్చుకుందామె అంటే..
ఉక్రెయిన్ మహిళ విక్టోరియా చక్రవర్తి భారతీయ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టక ముందు, ఆ తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌చేసింది. అది నెట్టింట వైరల్‌గా మారి, నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఆమె ఆ వీడియోలో తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి భారతీయ ఆహారం, స్థానిక పండుగల వరకు ప్రతీది ఎలా తన జీవితంల భాగమైందో తెలిపింది. అలాగే తన జీవింతంలోకి వచ్చిన ఈ మార్పులతో వెల్లివిరిసిన ఆనందం, జాయ్‌నెస్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ప్రధానంగా ఆ మూడు మార్పులు తన జీవితంలోకి భాగమయ్యేలా స్వాగతించానని అంటోంది.
అవేంటంటే..
చీర నెమ్మదిగా తన వార్డ్‌రోబ్‌లో భాగమైంది. అది లేకుండా ఏ పెళ్లికి లేదా ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటం ఊహించలేం అన్నంతగా..
చేతులతో సాంప్రదాయ ఆహారాన్ని తినడం, చాలా సహజంగా అనిపిస్తుంది.
ఏడాదిలో నాకు కొన్ని పండుగలు ఇష్టమైనవిగా మారిపోయాయి. వేడుకల గొప్పదనం, ఆ సంబరం కలిగించే ఆనందం తన మదిలో స్థిరంగా ఉండిపోడమే కాదు సంతోషాన్ని తెచ్చిపెట్టాయని అంటోంది.
అందుకు తగ్గట్టుగా ధరించే భారతీయ దుస్తులు అదరహో అనేలా ఉంటాయిని ప్రశంసించింది.
అలాగే విక్టోరియాలో భారత్‌లోనే గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు చెప్పుకొచ్చింది. చాలామంది తనను భారత్‌కి వెళ్లొద్దని సూచించారని, కానీ ఇక్కడకు రావడంతో తన జీవనశైలి మారిపోవడమే కాదు, ఎన్నో ఆనంద క్షణాలకు నెలవుగా మారిపోయిందని సంతోషంగా చెబుతోందామె. నెటిజన్లు కూడా భారతీయ దుస్తులు చాలా అందంగా కనిపిస్తున్నారని, మా సంస్కృతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు.
అలాగే దాన్ని ఇష్టపడతున్నందుకు మరింత సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, విక్టోరియా తను ఇండియాకు రావడాన్ని అందరూ వ్యతిరేకించినా..అక్కడి నుంచే మనకు కొత్త అధ్యయనం ప్రారంభమవ్వడమే కాదు, కొంగొత్త విషయాలు తెలుసుకుంటామని అంటోంది.
(చదవండి: భారత్‌లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు)