
మన దేశంలో పర్యటించి.. ఇక్కడి విభిన్నమైన సంస్కృతిక సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్కడే స్థిరపడాలనుకున్న ఎందరో విదేశీయుల మనోభావాలను విన్నాం. ఇప్పుడూ తాజాగా ఓ విదేశీ యువతి భారత్‌లో పర్యటించాలంటే ఈ తప్పులు చేయకండి..ఈ నేల తప్పక చూడాల్సిన ఎన్నో ప్రదేశాలకు నెలవు అంటూ భారత్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. ఇక్కడ కొన్ని పర్యటనల్లో పాశ్చాత్య దేశాల కట్టుబొట్టు తీరుని అనుసరించపోవడమే మేలు. పైగా కొన్ని రాష్ట్రాల్లో అక్కడి సంస్కృతికి మీకు తెలియకుండానే ఆటోమేటిగ్గా కట్టుబడిపోతుంటారని అంటోంది. మరి ఇంతకీ ఆమె పర్యటించేటప్పుడూ ఏ తప్పులు చెయ్యొందంటోంది? ఎవరామె?
ఎమ్మా అనే విదేశీ యువతి(Foreigner) భారత్(India)లో పర్యటించేటప్పుడూ ఈ తప్పిదాలు అస్సలు చేయొద్దంటూ టూరిస్ట్‌లకు సూచనలిచ్చే వీడియో నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది కూడా. భారతదేశం పర్యటించడానికి అనువైన అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటని అభివర్ణించింది.
తొలిసారిగా భారత్‌లో పర్యటించేటప్పుడూ తరచుగా అందరూ ఇలాంటి తప్పిదాలే చేస్తుంటారని అవి అస్సలు చేయొద్దని సూచించిందామె. చాలామంది భారత్ పర్యటన అనగానే ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వంటి పర్యాట ప్రదేశాలనే ఎంచుకుంటారు. అవి పర్యాటకులు రద్ధీగా ఉండే ప్రదేశాలని, వాటికంటే ప్రకృతి రమ్యతకు నెలవైనా ముగ్ధమనోహర ప్రదేశాలు చాలానే ఉన్నాయని అంటోంది.
చేయకూడని ఏడు తప్పిదాలు..
గోల్డెన్ ట్రయాంగిల్ (ఢిల్లీ, ఆగ్రా, జైపూర్) సందర్శించడం మాత్రమే అద్భుతమైని అనుకోకండి. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది. ముఖ్యంగా కేరళ, రాజస్థాన్, హిమచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలను అస్సలు మిస్ అవ్వద్దు.
నిరాడంబరమైన దుస్తులను ధరించొద్దు. ముఖ్యంగా దేవాలయాల్లో, గ్రామీణ ప్రాంతాలు భుజాలు, మోకాళ్లను కవర్ చేసే దుస్తులు ధరిస్తే గౌరవప్రదంగా చూస్తారని, ఇబ్బందికరమైన చూపులు ఎదురవ్వవని అంటోంది.
ప్రయాణ సమయాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. అదీగాక గూగుల్ మ్యాప్ మీకు ఐదు గంటలని చూపిస్తే..సులభంగా ఎనిమిది గంటలు పడుతుందని అర్థం. దూరం తక్కువే అయినా, రోడ్లు ట్రాఫిక్ మయం అనే విషయం జ్ఞప్తికి ఉంచుకోండి.
కుళాయి నీరు తాగొద్దు బాటిల్ వాటర్‌కే ప్రాధాన్యత ఇవ్వండి.
అలాగే వీధి ఆహారాల జోలికి వెళ్లొద్దు. ప్రజలు రద్దీగా ఉన్న ఫుడ్‌స్టాల్స్‌కి ప్రాధాన్యత ఇవ్వండి.
ముందుగానే రైళ్లను బుక్‌చేసుకోండి. ఎందుకంటే భారతీయ రైల్వేల్లో టికెట్లు వేగంగా అమ్ముడైపోతాయి. ముందుగానే ప్లానే చేసుకుంటేనే మంచిది
అలాగే భారత్‌లో పాశ్చాత్య టైమింగ్స్‌ని ఫాలో అవ్వద్దు. భారతదేశ సమయానుకూలంగా ప్రవర్తించండి. విశ్రాంతి తీసుకోండి, అలాగే కాస్త కన్ఫ్యూజన్‌ని కూడా ఓర్చుకోండి. ఎమ్మా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారడమే కాదు ఆమె సూచనలకు ధన్యావాదాలు అంటూ పోస్టులు పెట్టారు.
ప్రతి టూరిస్ట్ పొందే అనుభవమే ఇది అని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు కొందరు. కాగా, ఎమ్మా భారత్ పర్యటన తనను పూర్తిగా మార్చేసిందని, కేరళ తనను అణుకువగా ఉండటం ఎలా అనేది ప్రోత్సహించింది, ఆలోచింపచేసిందని, ఇక్కడి సంస్కృతికి బాగా కనెక్ట్ అయ్యిపోయా అంటూ తన పోస్ట్‌ని ముగించిందామె.
(చదవండి: ఇద్దరు పిల్లల తల్లి వెయిట్ లాస్ సీక్రెట్: ఏకంగా 84 కిలోల నుంచి 56 కిలోలకు తగ్గి..)