
కొన్ని అద్భుతాలు హృదయానికి హత్తుకునేలా మంత్రముగ్ధల్ని చేస్తుంటాయి. అస్సలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆశ్చర్యమేస్తుంది. చూడటానికి రియలిస్టిక్‌గా ఉండే ఆర్ట్‌ల గొప్పదనం మాటల్లో చెప్పలేం. అంత ఓపికగా ఎలా చేస్తున్నారనే అనుమానం కచ్చితంగా వచ్చేస్తుంది. ఓ భారతీయడు ఆ అందమైన క్లాక్ కళకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
అందులో ఏముందంటే..నెదర్లాండ్ ప్రధాన అంతర్జాతీయ కేంద్రమైన ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయం షిపోల్‌లో ప్రత్యేకమైన 'హ్యూమన్ వాచ్'ను చూసి భారతీయ ప్రయాణికుడు ఎస్‌కే ఆలీ విస్తుపోయాడు. చూడటానికి నిజమైన గడియారాన్ని తలపించే హ్యుమన్ వాచ్ ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే రెండు కళ్లు చాలవేమో అన్నంతగా మాయ చేస్తోంది. ఆ గడియారంలో ఒక మనిషి అచ్చం రియల్ గడియారంలో టైం చూపించే ముల్లుల మాదిరిగా క్షణాల్లో టైంని చూపిస్తూ..తుడుస్తూ కనిపిస్తుంది.
అదంతా ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏ మాత్రం ఒంకర టిక్కరి లైన్లు లేకుండా రియల్ గడియారం మాదిరిగా టైంని చూపిస్తున్న విధానం చూస్తే..నోటమాట రాదని అంటున్నాడు అలీ. ఆ గడియారం లోపల వ్యక్తి చేతితో ప్రతి నిమిషాన్ని ఇండికేట్ చేసేలా నిమిషా ముల్లుల గీతలను రిప్రెజెంట్ చేస్తూ చెరిపేయడం చూస్తే..ఇంతలా గీయడం ఎవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది. చూడటానికీ ఏదో యానిమేటెడ్‌లా ఉంటుంది.
ఒక సాధారణ గడియారాన్ని మిళితం చేసేలా ఉంది ఈ హ్యూమన్ వాచ్ కళ. రియల్ టైమ్‌గా పిలిచే హ్యుమన్ వాచ్‌ని డచ్ కళాకారుడు మార్టెన్‌బాస్ రూపొందించారట. ఇందులో నటుడు టియాగో సాడా కోస్టా పారదర్శక తెరపై గడియారపు ముళ్లను చెరిపివేసి తిరిగి గీస్తున్న 12 గంటల లూప్ చేయబడిన వీడియో ఉంది. ఆ పెయింటింగ్ సయంలో నిమిషానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ముద్రను చూపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి ఈ కళారూపం వెనుక ఉన్న క్రియేటివిటీకి జోహార్లు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్‌తో రోజుకు రూ.లక్ష పైనే..!)