
ఒక్కోసారి పెద్దపెద్ద చదవులు చదివినా..ఉద్యోగం సంపాదించడంలో విఫలమవుతుంటారు. టన్నుల కొద్దీ డిగ్రీలు చేసినా అక్కరకు రాకుండా పోతుంటాయి. అలా అని నైరాశ్యంతో కూర్చోకుండా ఏదో ఒక మార్గం ఎంచుకుని ముందుకుపోయి గ్రేట్ అనిపించుకునే వారు ఒకరో, ఇద్దరో ఉంటారు. ఆ కోవకు చెందినవాడే ఈ చైనీస్ వ్యక్తి. ఈ వ్యక్తి చదివినదానికి చేస్తున్న పనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఓ గొప్ప సందేశం అందించాడు.
జియాంగ్సు ప్రావిన్స్ నుంచి పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 37 ఏళ్ల డింగ్ స్టోరీ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన బెల్జియంలో భూ సంరక్షణ, పంట ఉత్పత్తిలపై పరిశోధన కూడా చేశారు. దాదాపు 30 పరిశోధనా పత్రాలు సమర్పించి మరి డాక్టోరల్ పట్టాని కూడాపొందారు. ఇంతటి ఉన్నత విద్యావంతుడైనా అవేమి ఆయనకు జీవనాధారం కాలేకపోయాయి.
కనీసం అతడి పొట్టని పోషించేకునే సామర్థ్యాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కించెత్తు నిరాశకు చోటివ్వకుండా తన భార్య వాంగ్‌తో కలిసి స్పైసీ చాంగ్‌కింగ్ తరహా బఠానీ నూడుల్స్ అమ్మూతూ..ఫుడ్ వ్యాపారంలో మంచి లాభాలను అందుకున్నాడు. అంతేగాదు అనతికాలంలోనే అతడి ఫుడ్‌స్టాల్ ఫేమస్ అయ్యి ఏకంగా రోజుకి రూ. లక్ష రూపాయల పైనే ఆర్జించే రేంజ్‌కు చేరకున్నాడు.
గత మేనెలలో తన భార్య వాంగ్ స్వస్థలంలోని స్థానిక మార్కెట్లో ఈ ఫుడ్ స్టాల్‌ని ప్రారంభించారు. ఒక ప్లేట్ స్పైసీ బఠానీ నూడుల్స్ ధర రూ. 600 నుంచి రూ. 700 పై చిలుకు అమ్ముతున్నట్లు వెల్లడించాడు డింగ్. స్థానికుల అభిరుచులకు అనుగుణంగా కాస్త స్పైసీ తగ్గించి విక్రయించి.. కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. నెటిజన్లు సైతం ఆ జంట చాలా తెలివైన వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. విదేశంలో చైనీస్ నూడుల్స్‌తనో ఆదాయం సృష్టించుకున్న తెలివైన వ్యవస్థాపక దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ)