
బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేకతే వేరు, నటుడుగా, వ్యాఖ్యాతగా, హోస్ట్‌గా సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 1973, జూన్ 3న బాలీవుడ్ హీరోయిన్ జయ బచ్చన్ వివాహం చేసుకున్నారు. అయిదుదశాబ్దాల వైవాహిక జీవితంలో అత్యంత నిత్యనూతన జంట అనడంలో సందేహంలేదు.
పాతికేళ్లుగా కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) అనే గేమ్ షోను విజయవంతంగా నిర్వహిస్తున్న అమితాబ్ తాజాగా బిగ్ బీ తన భార్య జయాబచ్చన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఎపిసోడ్‌లో, తన భార్య జయ గురించి ఒక జోక్ వేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. కేబీసీ షోలో ఆశా ధిర్యన్ అనే కంటెస్టెంట్ తో బిగ్‌బీ మాట్లాడుతూ 'అద్భుత మహిళ'గా ఆశాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు 60 సెకన్లలో తనను తాను ప్రశంసించుకోవాలని కోరారు. తనను తాను పొగుడుకోవడం పూర్తి చేసిన తర్వాత, బాలీవుడ్ సూపర్ స్టార్ ని తన భార్య జయ గురించి ఏదైనా మంచిగా చెప్పమని కోరింది. దీంతో 52 ఏళ్లుగా ఆమె నన్ను భరిస్తోంది,దీని కంటే పెద్ద పొగడ్త ఇంకేముంటుంది? అయినా పొట్టి వాళ్లతో తిట్లు తినడం తనకు కొత్తేమీ కాదు అంటూ ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్న బిగ్‌బా తన భార్య జయా బచ్చన్ హైట్‌పై కామెడీ చేసేవారికి సరియైన జవాబు చెప్పారు.
ఈ షోలో ఆశా తన ప్రేమకథ గురించి, ఎత్తు విషయంలో తమజంట మధ్య ఉన్న తేడా, ఫ్రెండ్స్ జోకులు గురించి చెప్పుకుంది.చాలా పొడవుగా ఉండే తన భర్త తనతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడని షోలో చెప్పింది. ఆమె కథ విన్న బిగ్ బి రియాక్ట్ అయ్యాడు, ఆమె చెప్పింది తనకు చాలా నచ్చిందని, అయితే తాను బాగా కనెక్ట్ అయ్యే ఒక విషయం ఉందని, ఆమె కథను వినడం తనకు నచ్చిందని చెబుతూ ఒక పొట్టి వ్యక్తి ఒక పొడవాటి వ్యక్తిని తిట్టడం తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. దీంతో షోలో నవ్వులు పూసాయి.
కాగా అమితాబ్-జయ జంట పిల్లలే అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా. అమితాబ్ వారసుడిగాఅభిషేక్ బచ్చన్ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇక అమితాబ్ కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఐశ్వర్య ఆ ఫ్యామిలీకి మరింత వన్నె తెచ్చిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.