సాక్షి హైదరాబాద్: రాష్ట్రానికి సీఎం రేవంత్ తీరని జలద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్ల విషయంలో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తామే లేపామన్నారు. బీఆర్ఎస్ చెప్పినాకే ఆ అంశంపై ప్రభుత్వం స్పందించింది అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని హరీశ్‌రావు విమర్శించారు.
అయితే అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీశ్ రావు విరుచుకపడ్డారు. జలమంత్రిగా పనిచేస్తూ రెండేళ్లయినా ఇంకా ఆ శాఖపై అవగాహన రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఇచ్చిన జీఓలో 90TMCల నీటి కేటాయింపు అంశం అస్పష్టంగా ఉందని ప్రస్తుత ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరిస్తూ లేఖ రాసిందని హరీశ్ రావు విమర్శించారు.


