
ఏ ట్రైన్ అయిన తన గమ్య స్థానం చేరుకోవడానికి ఒకటి లేదా రెండురోజులు పడుతుంది. మరి దూరం అనుకుంటే మూడు నుంచి ఐదు రోజులు పట్టేవి కూడా ఉంటాయి. అలా ఇలా కాకుండా ఏకంగా నెలల తరబడి ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకునే రైలు గురించి విన్నారా..?. ఈ రైలు ఏకంగా 13 దేశాలను కవర్ చేసుకుంటూ వెళ్తుంది. రైలు జర్నీ ఇష్టపడే ఔత్సాహికులకు నచ్చే సుదీర్ఘ ట్రైన్ జర్నీ ఇది. ఎక్కడంటే ఇదంతా..
ఈ రైలు పోర్చుగల్ నుంచి ప్రయాణికులను సింగపూర్‌కి తీసుకువెళ్తుంది. ప్రపంచంలోనే అతి సుదీర్ఘ రైలు జర్నీ ఇదేనట. మొత్తం 18,755 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది ఈ రైలు. ఈ రైలు ప్రయాణం పోర్చుగల్ సముద్ర తీర పట్టణం లాగోస్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి స్పెయిన్ గుండా ఉత్తరం వైపుకి వెళ్లి పారిస్‌కి చేరుతుంది. ఫ్రాన్స్ రాజధాని చేరుకున్న తర్వాత యూరప్ గుండా పశ్చిమానికి వెళ్లి..సైబీరియన్‌కు వెళ్తారు.
అక్కడ నుంచి బీజింగ్ చేరుకోవడానికి ఆరు రాత్రులు పడుతుందట. అక్కడ నుంచి సుదీర్ఘ ప్రయాణంలో వియంటియాన్ రైల్వే నుంచి బ్యాంకాక్‌కు పయనమవుతుంది. ఈ జర్నీలో చివరి భాగం మలేషియా గుండా ప్రయాణించి తన గమ్యస్థానమైన సింగపూర్‌కు చేరుకుంటుంది. మొత్తం ఈ సుదీర్ఘ ట్రావెలింగ్‌కి దగ్గర దగ్గర 21 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు కానీ, ఒక్కోసారి రైలు ఆగిన స్టాప్‌లను పరిగణలోనికి తీసుకుంటే నెలల తరబడి సాగే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు రైల్వే అధికారులు.
ఎందుకిలా అంటే..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడం వల్ల యూరోపియన్ లోపల నుంచి రష్యాకు అన్ని రైలు ప్రయాణాలను నిలిపేశారు. అలాగే కామన్వెల్త్ డెవలప్‌మెంట్ కార్యాలయం(ఎఫ్‌డీఓ) కూడా రష్యా గుండా వెళ్లే అన్ని ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. భద్రత దృష్ట్యా ఇలా రష్యా గుండా వెళ్లే అవకాశం లేకపోవడం తోపాటు యూకేకి నేరుగా విమానాలు లేకపోవడం, అక్కడ ప్రభుత్వానికి ఉన్న పరిమిత సామర్థ్యం తదితరాల దృష్ట్యా ఇలా చుట్టి తిరిగి సింగపూర్‌కి చేరుకోక తప్పని పరిస్థితి.
(చదవండి: వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!! రీజన్ ఇదే..)