వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై చాలామంది ప్రముఖులు, ప్రజలు పలు రకాలుగా తవ వాదనలు వినిపించారు. పైగా అన్ని గంటలు ఆఫీస్‌లకే పరిమితమైతే..ఫ్యామీలీ సంగతేంటి అని పలువురు వాపోయారు కూడా. కానీ మనసుంటే అన్ని సాధ్యమే..అటు ఆరోగ్యం ఇటు ఫ్యామిలీ అన్నింటిని కూడా సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వాళ్లందర్నీ వెనక్కినెట్టి ఓల్డ్ ఏజ్‌లో ఏకంగా 12 గంటలు షిఫ్ట్‌లో పనిచేస్తూ విస్మయానికి గురిచేయడమే కాదు..ఆ వయసులో ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండి మరింత కంగుతినేలా చేశాడు. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లను తెగ ఆకర్షించింది.
ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. సోషల్ మీడియా వ్లాగర్ లైంగ్ అనే వ్యక్తికి సింగపూర్‌లో ఓ వృద్ధ కార్మికుడి తారసపడతాడు. అతడు బాత్రూంలను క్లీన్ చేసే వ్యక్తిగా గుర్తిస్తాడు. అతడికి దగ్గర దగ్గర 90 ఏళ్లుపైనే ఉంటాయి. లైంగ్ ఆ వృద్ధుడితో మాటలు కలుపుతాడు. మీరు ఎలా ఉన్నారని ప్రశ్నించగా వృద్ధుడు చాలా బాగున్నానని సమాధానం ఇస్తాడు. ప్రతి రోజు మీ వర్క్ ఎలా సాగుతుందని అడగగా అతడు తన వయసు గురించి అగుడుతున్నాడని పొరబడి.. ఆ వృద్ధుడు తన వయసు 91 ఏళ్లు అని రిప్లై ఇస్తాడు.
వెంటనే లాంగ్ తేరుకుని ..కాదు ఈ వయసులో ఇంకా పనిచేస్తున్నావు..అని ఆశ్చర్యపోతూ ఎన్ని గంటలు వరకు పనిచేస్తావని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి రాత్రి ఏడింటి వరకు పనిచేస్తానని, రోజుకు 12 గంటల షిఫ్ట్ అని వివరిస్తాడు. దాంతో వ్లాగర్ బాస్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు, నీ ఫిట్‌నెస్ రహస్యం ఏంటి అని చాలా కుతుహలంగా అడుగుతాడు. దానికి అతడు సాధారణ భోజనమే తింటానని, అయితే వ్యాయమం మాత్రం తానెప్పుడూ చేయలేదని చెప్పుకొస్తాడు.
అంతేగాదు వ్లాగర్ లైంగ్‌తో ఎప్పుడూ వ్యాయామం చేయవద్దు అని సలహ కూడా ఇస్తాడు. దాంతో లైంగ్ నవ్వుతూ..నువ్వు జీవితంలో ఎప్పుడూ వ్యాయామం చేయలేని గొప్ప మనిషివి అని వ్యాఖ్యానిస్తాడు. చివరగా అతడికి వీడ్కోలు పలుకుతూ.. భోజనం చేయమని కొంత డబ్బు ఇవ్వడమేగాక.. నువ్వు ఒక గొప్ప సైనికుడివి జాగ్రత్తగా ఉండు..కష్టపడి పనిచేస్తుండూ అని చెప్పి నిష్క్రమిస్తాడు.
ఆ వీడియో హీరో మాధవన్‌ని సైతం కదిలించింది. మాధవన్ కూడా ఆ వీడియో క్లిప్‌ని రీషేర్ చేస్తూ..స్ఫూర్తిదాయకమైన వీడియో అంటూ ప్రశంసించాడు. ఇక నెటిజన్లు..ఈ వీడియో కన్నీళ్లు పెట్టించేస్తోంది. అతడు ఎల్లప్పుడూ ప్రజలతో సంభాషిస్తాడు, అందుకే ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ ఘటన వ్యాయామం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం కాదని, ఆనందమే కీలంగా అని ప్రూవ్ చేసింది. అందువల్లే అతను సంతోషంగా అన్ని గంటలు పనిచేస్తున్నాడంటూ ఆ వృద్ధ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.
(చదవండి: అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..)


