
దేశం మొత్తం నవరాత్రుల సందడితో ఉంది. ఎటుచూసిన దాండియా, గర్భా నృత్యాలతో పండుగా వాతావరణంతో కళకళలాడుతోంది. ఈ పండుగను ఒకే దేశంలో పలు విధాలుగా జరుపుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంలా ఉండే మన సంస్కృతిక సంపద్రాయాన్ని గౌరవిస్తూ..నృత్యం చేసి నెటిజన్ల మనసును దోచుకున్నాడు ఈ అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆవీడియోలో ప్రుమఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రికీ పాండ్ గంగూబాయి కతియావాడిలోని ప్రసిద్ధ పాట 'ధోలిడా'కి నృత్యంకి నటి ఆలియా భట్‌ని తలపించేలా డ్యాన్స్ చేశారు. తన లివింగ్ రూమ్‌లో సాధారణ డ్రెస్ వేర్‌లో ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. అంతేగాదు ఆయన ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..నవరాత్రి శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో అతని అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అతని ఎనర్జీకి నెటిజన్లు ఫిదా అవ్వుతూ..వేరే దేశం నుంచి వచ్చి భారతీయ సంస్కృతిని స్వీకరించడం నిజంగా చాలాగ్రేట్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ గుజరాత్‌కు రండి ఇక్కడ నవరాత్రి పండుగను ఆస్వాదించండి, మీ రాకకై ఎదురుచూస్తున్నాం అని పోస్టులు పెట్టారు.
(చదవండి: అగరుబత్తీలు వెలిగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం!)