
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంటూ టీవీలో వచ్చే అగరుబత్తీల యాడ్‌లు మనల్ని ఎంతలా ప్రేరేపిస్తాయంటే..అవి తెచ్చుకున్న వెంటనే ఉపయోగించాలనే ఆత్రుతను పెంచేస్తాయి. అదీగాక వాటి గుబాళింపు మనకు దేవాలయంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి. పైగా ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ప్లేవర్ల అగరుబత్తీలు వచ్చేశాయి కూడా. ముఖ్యంగా భారతీయ గృహాల్లో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఆనందాన్ని, మానసిక స్వాంతనను అందించడంలో ముందుంటాయి. అలాంటి అగరబత్తీలు వెలిగించడం, అచ్చం సిగరెట్లు కాల్చడం లాంటి అనారోగ్యానికి దారితీస్తుందా..?.ఔనని చెబుతున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు ఏవిధంగా ఊపిరితిత్తులకు హానికరమో అలానే అగరుబత్తీలు కూడా ప్రమాదమని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.
ఇవి ఊపరితిత్తులకు ఎలా హానికరమో డెహ్రాడూన్‌కి చెందిన పల్మోనాలజిస్ట్ డాక్టర్ సోనియా గోయెల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ అగరుబత్తీలు ఊపిరితిత్తులకు హాని కలిగించే కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని, అవి అచ్చం పొగాకు మాదిరిగా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. వీటి నుంచి వచ్చే పొగ ఊపరితిత్తులకు నెమ్మది నెమ్మదిగా విషంలా మారుతుందని అన్నారు.
ఏవిధంగా అంటే..
అగర్బత్తీలు సూక్ష్మ కణ పదార్థం (PM2.5), కార్బన్ మోనాక్సైడ్, అస్థిర సేంద్రీయ సమ్మేళనాలను విడుదల చేస్తుందని చెప్పుకొచ్చారామె. ఈ కాలుష్య కారకాలు మన ఇండోర్ గాలిని కలుషితం చేస్తాయని, ముఖ్యంగా మూసి ఉన్న ప్రదేశాల్లో శ్వాస తీసుకోవడం సురక్షితం కాదని తెలిపారామె. అంతేగాదు ఒక అగరబత్తిని ాకాల్చడం అంటే ఒక సిగరెట్‌ని కాల్చినంత ప్రమాదమని సోనియా అన్నారు. అంటే ధూమపాన అలవాటు లేకపోయినా..ఈ విధంగా పొగాకు సంబంధింత అనారోగ్యాల బారినపడతామని వెల్లడించారు.
అధిక ప్రమాదం ఎవరికంటే..
పిల్లలు, వృద్ధ కుటుంబ సభ్యులు, ఉబ్బసం లేదా ఊపరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ అగరబత్తులను కాల్చడం ప్రాణాంతకమవుతుందని అన్నారు. ఒక్కోసారి అలెర్జీలు, దీర్ఘకాలిక దగ్గు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తుతాయి. అలాగే సరైన వెంటిలేషన్ ఇంటిలో ఈ అగరబత్తీలు వెలిగిస్తే.. సంత్సరాల బడి ఆ పొగాకు బహిర్గతమైన ఆ ఇంటి సభ్యులకు బ్రోన్కైటిస్, ఉబ్బసం, COPD, ఊపరితిత్తుల కేన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అన్నారు.
సరైన వెంటిలేషన్ ఉన్న ఇంటిలో వీటని ఉపయోగించినట్లయితే సమస్య ఉండదని అన్నారు. అలాగే ఆ సమయంలో కిటికీలు, ఫ్యాన్‌లు ఆన్ చేయడం వంటివి నష్టాన్ని చాలామటుకు తగ్గిస్తాయని అన్నారు. ఇంటిలో చక్కటి గాలి ప్రవాహం ఉంటే ఎలాంటి సమస్య ఉండదని అన్నారామె.
ప్రత్యామ్నాయాలు..
ఈ అగరుబత్తీలు లేకుండా ఆచారాలు అసంపూర్ణం అనిపిస్తే..నూనె డిఫ్యూజర్‌లు, ఎలక్ట్రిక్ డయాలు ఉపయోగించండి. లేదా సహజ సూర్యకాంతి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో ఊరితిత్తుల సమస్యల బారిన పడకుండా ఉండటమే గాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందగలుగుతామని అన్నారు డాక్టర్ సోనియా.