ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు..! | English-Speaking Village in West Bengal: A Unique Success Story | Sakshi
Sakshi News home page

ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు..!

Sep 21 2025 3:53 PM | Updated on Sep 21 2025 4:27 PM

Kaliachak in Malda district  Indias English Teachers Village

గ్రామీణ నేపథ్యం అయితే ఇంగ్లీష్‌ భాషపై అంత పట్టు ఉండదనేది తెలిసిందే. కానీ కొందరు పట్టుదలతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పట్టణాల్లోని యువతతో పోటీపడి సత్తా చాటారు కూడా. కానీ ఇక్కడ ఈ గ్రామంలో ఆంగ్ల భాషలో మాట్లాడుతున్న తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. అక్కడ చిన్న పిల్లల నుంచి వృద్ధులు వరకు అందరూ అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడతారట. ఔను మీరు వింటుంది నిజమే. ఎక్కడంటే ఇదంతా..

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని కాలియాచక్ గ్రామంలో అందరూ ఇంగ్లీష్‌ భాషలోనే అనర్గళంగా మాట్లాడుతుంటారు. అంతేగాదు ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్‌ టీచర్‌​ ఉన్నారట. ఆ గ్రామ వీధుల్లో నడుస్తుంటే..ఎటు చూసిన ఇంగ్లీష్‌ ప్రతిధ్వని వినిపిస్తుంది. అది చూసి కొత్తగా వచ్చిన వారికి ఎవ్వరైనా..ఏ విదేశంలోనైనా ఉన్నామేమో అనే అనుభూతి కలుగుతుంది. 

అక్కడ ఎక్కడ చూసినా..IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్షకు సిద్ధమవుతున్న వారే కనిపిస్తారు. అందుకోసం చాలా కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి ఆ గ్రామంలో. అంతేగాదు ఇక్కడ ఇంగ్లీష్ కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే కాదు.. కెరీర్, జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.

అదెలా సాధ్యమైందంటే..
ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. కాలియాచక్ గ్రామంలోని ప్రతి ఒక్కరూ రాత్రికి రాత్రే ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం సంపాదించలేదు. దశాబ్దాల కృషి, పాఠశాలల కృషి , ప్రజల అంకితభావం కలిపి ఈ గుర్తింపును తీసుకొచ్చాయి. కాలియాచక్ గ్రామంలో ఫైజీ అకాడమీ, తర్బియాత్ పబ్లిక్ వంటి పాఠశాలలు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నాయి. చాలా మంది గ్రామస్తులు ఈ పాఠశాలల నుంచే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. 

అలా ప్రతి వీధిలో  శిక్షణ, బోధనా కేంద్రాలు ఉన్నాయి. ఇక ఈ కాలియాచక్ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామంలోని టీచర్స్ తమ గ్రామానికి లేదా పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో కూడా వందలాది మంది టీచర్స్ పాఠాలను బోధిస్తారు. మరోవైపు చాలామంది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశాలలో పిల్లలకు ఇంగ్లీష్ బోధిస్తున్నారు. వీరి కుటుంబాలు తరువాతి తరం ఇంగ్లీష్ బోధించడంలో రాణించేలా గ్రామంలో చిన్న చిన్న కోచింగ్ సెంటర్‌లను నిర్వహిస్తున్నాయి

మరో ప్రత్యేకత ఏంటంటే..
ఈ గ్రామంలోని పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ‍ప్రోత్సహిస్తారు. అలాగే పండుగలు, ఉత్సవాల్లో ఇంగ్లీష్‌లో డిబేట్‌ పోటీలు జరుగుతాయి.  ఈ గ్రామం కేవలం విద్యా కేంద్రంగా మాత్రమే కాదు మామిడి, లిచీలను కూడా పండిస్తోంది. పట్టు , జనపనార వ్యాపారం చేస్తుంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బోధన  అనేది ఈ గ్రామం ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చేసిందని చెబుతున్నారు నిపుణులు.

(చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement