
భారతదేశం అంతటా దుర్గమ్మ నవరాత్రుల సంభరాలతో కోలహలంగా మారింది. ఎటుచూసిన శరన్నవరాత్రుల సందడే కనిపిస్తుంది. రేపటి నుంచి మొదలుకానున్న ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎంతో భక్తిప్రపత్తులతో కొలుచుకుంటారు. ఇక తొలిరోజు నుంచి దశమి వరకు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా, ఉల్లి, వెల్లుల్లిని లేకుండా ఒంటిపూట భోజనాలతో కఠిన నియమాలను అనుసరిస్తారు. ముఖ్యంగా భవాని మాలధారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతలానో కఠిననియమాలను అనుసరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటారో తెలిసిందే. అంతటి పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల్లో అక్కడ మాత్రం దుర్గమ్మ తల్లికి చేప, చికెన్ వంటి నాన్‌వెజ్ ఆహారాలనే నైవేద్యంగా నివేదించడమే కాదు అవే తింటారట ఆ తొమ్మిది రోజులు. అదేంటని విస్తుపోకండి. ఇంతకీ అదెంత ఎక్కడో తెలుసా..!.
పశ్చిమబెంగాల్‌లో ఈ విభిన్నమైన ఆచార సంప్రదాయం ఉంది. అక్కడ బెంగాలీల కుంటుంబాలన్నీ నాన్‌వెజ్ వంటకాలతో ఘమఘమలాడిపోతుంటాయి. అక్కడ ఎక్కువగా మతపరమైన పండుగల్లో చేపలు, మాంసం వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయట. అక్కడ ఇలా మాంసాహారాన్ని నివేదించడాన్ని పవిత్రంగా భావిస్తారని చరిత్రకారుడు నృసింహ భాదురి చెబుతున్నారు. బెంగాల్‌లోని అనేక ఆలయ ఆచారాల్లో మాంసాహారం నివేదించడం ఉంటుందట.
ఇక్కడ అమ్మవారి ఉగ్ర రూపమైన కాళి ఆరాధన ఎక్కువగా ఉంటుందట. ఆమెకు మేకబలి, మాంసాన్ని నివేదించడం వంటివి ఉంటాయట. ప్రసాదంగా వాటిని వండుకుని తింటారట. అంతేగాదు వేయించి కూరగాయలు, చేపలు, మాంసం వంటి నైవేద్య సమర్పణ ఉంటుందట. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే కొన్ని ప్రాంతాలకు భిన్నంగా ఉంటుందట. ఇక్కడ శాకాహారాన్ని స్వచ్ఛమైనదిగా భావిస్తే..అక్కడ మాంసాహార సమర్పణను పవిత్రంగా భావిస్తారట.
ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..
కోషా మాంగ్షో - నెమ్మదిగా వండిన మటన్ కర్రీ, ముదురు, రిచ్ అండ్ లూచీస్ (డీప్-ఫ్రైడ్ పఫ్డ్ బ్రెడ్) తో జత చేసింది.
ఇలిష్ మాచ్ - ప్రియమైన హిల్సా, తరచుగా ఆవాలు లేదా వేయించిన బంగారు రంగులో ఉడికించిన వంటకం.
బంగాళాదుంపలతో చికెన్ కర్రీ - ఇంట్లో ఇష్టపడేది, తరచుగా వారాంతపు కుటుంబ భోజనంలో భాగం. మటన్ బిర్యానీ, ముఖ్యంగా కోల్‌కతాలో బంగాళాదుంప ముక్కతో బిర్యానీ పవిత్రమైనదిగా పరిగణిస్తారట.
చేపల ఫ్రై, పులుసు: నవరాత్రుల్లో ఇది తప్పనిసరి వంటకం, భక్తులకు ప్రసాదంగా ఇచ్చే రెసిపీ కూడా.
(చదవండి: ఢిల్లీలో జరిగే రామ్‌లీలా నాటకంలో పరశురాముడిగా బీజేపీ ఎంపీ)