మలుగు బెన్ చేప.. ఇది అచ్చం పామును పోలి ఉంటుంది. కేవలం చిన్న వెన్నెముక మాత్రమే ఉండి శరీరం మొత్తం మాంసంతో ఉండే ఈ చేపకు మార్కెట్‌లో గిరాకీ ఉంది. ఓమెగా–3, ప్రొటీన్ ఉండే ఈ చేప రుచిగా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ చేపలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాజీపేట మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఈ చేపల వినియోగంతో ఆయుర్వేద పరంగా సత్ఫలితాలు ఉంటాయనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో వీటి కొనుగోళ్లకు అనేక మంది పోటీ పడుతుంటారు. గోదావరి నది జలాల నుంచి వచ్చిన ఈ చేపలు ధర్మసాగర్ దేవాదుల రిజర్వాయర్‌లో కలిశాయి. దీంతో ప్రతీరోజు వ్యాపారులు వీటిని మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోకు రూ.450కు పైగా ధర పలుకుతుంది. కాగా, పాతతరానికి ఈ చేపలంటే చాలా ప్రీతి. కొత్తతరం మాత్రం అమ్మో పాములు తింటారా అంటారు.
(చదవండి:


