
ఢిల్లీలో ప్రతి ఏటా రామ్‌లీలా నాటక ప్రదర్శన ఎంతో వైభోవపేతంగా జరుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాటకంలో ప్రముఖులు, సెలబ్రిటీలు, నటులు ఇందులో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అదరమో అని బిరుదుల అందుకుంటుంటుంది. ఈసారి కూడా అలానే నటులు, గాయకులతోపాటు రాజకీయ నాయకులు కూడా పాల్లొనడం విశేషం. ఈ ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో రామ్‌లీలకు సంబంధించిన లవ్‌కుశ అనే నాటికను ప్రదర్శించనున్నారు.
అందులోని పరుశురాముడి పాత్రలో బీజేపీ ఎంపీ , భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ నటించనున్నారు. విఘ్ణువు ఆరవ అవతారంగా భావించి పరుశురాముడిలా ఒదిగిపోనున్నారు ఎంపీ తివారీ. ఆయన గతేడాది కూడా ఇదే పాత్రలో ఒదిగిపోయి ప్రశంసలందుకున్నారు. పౌరాణిక పురాణాల ప్రకారం పరుశురాముడు కలియుగం చివరిలో కల్కి గురువుగా కనిపిస్తాడని చెబుతుంటారు. ఇక రాముడి పాత్రలో నటుడు కిన్షుక్ వైద్య, నటుడు ఆర్య రావణుడి పాత్రను పోషిస్తున్నారు. అలాగే గాయకుడు శంకర్ సాహ్నే గతేడాది పోషించిన పాత్రలోనే ఒదిగిపోనున్నారు.
రామ్‌లీలా నాటక విశిష్టత..
యునెస్కో జాబితాలో కూడా ఈ రామలీలా నాటకం చోటుదక్కించుకుంది. యునెస్కో ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్ వెబ్‌సైట్ ప్రకారం..అక్షరాల రామాయణ ఇతిహాసానికి సంబంధించిన రాముడి నాటిక ఇది. ఇందులో కథనం, పారాయణం, సంభాషణలు ఉంటాయి. ఇది ఉత్తర భారతదేశం అంతటా దసరా పండుగ సందర్భంగా ప్రదర్శించడం జరుగుతుంది.
ప్రతి ఏడాది శరదృతువులో ఈ నాటకంను ప్రదర్శిస్తారు. దీన్ని తులసీదాస్ విరచిత రామచరిత మానస్ ఆధారంగా రూపొందిస్తారు. ఇక ప్రపంచంలోనే అతి పురాతనమైన రామ్‌లీల నాటిక వారణాసిలోని చిత్రకూట్ రామ్‌లీల ప్రదర్శితమవుతోంది. ఇక్కడ ఇది సుమారు 485 సంవత్సరాల క్రితం నుంచి ప్రదర్శిస్తున్నారట.
(చదవండి: బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం)