
మనం ఎలా పుట్టామన్నది కాదు..మన జీవితాన్ని ఎలా మలుచుకున్నామనేది ముఖ్యం. అది మన రేంజ్‌ని, ఉనికిని తెలియజేస్తుంది. అదే ప్రూవ్ చేసింది పాక్ అమ్మాయి. పుట్టింది పాక్‌లో..ఫేమస్ అయ్యింది చైనాలో. ఎంతలా ఆమెకు సోషల్ మీడియా క్రేజ్ ఉందంటే..ఓవర్‌నైట్ స్టార్ రేంజ్‌లో ఫాలోవర్స్ ఉన్నారామెకు. ఇంతకీ ఎవరా అమ్మాయంటే..
ఆ అమ్మాయే 20 ఏళ్ల ఫ్యాన్ జిహే. పాకిస్తాన్ మూలాలకు చెందిన ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జననం అచ్చం కర్ణుని మాదిరిగా జరిగింది. ఎలా మహాభారతంతో కుంతీదేవి కర్ణుని ఒక పెట్టేలా వదిలేసిందో అలా ఫ్యాన్ పాక్ తల్లిదండ్రులు పుట్టగానే ఒకకార్డుబోర్డు పెట్టేలో వదిలేశారు. అయితే పాక్‌లో పనిచేస్తున్న చైనా దంపతులుకు ఆశిశువు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ చిన్నారిని చైనా దంపతులు దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలా ఫ్యాన్ చైనాలోని హెనాన్ అనే గ్రామంలో పెరిగింది.
ఆ దంపతులు తిరిగి చైనాకి వచ్చి స్థిరపడటంతో ఆమె బాల్యమంతా చైనా దేశంలోనే సాగింది. 2023 ఆమె లైఫ్ ఊహించిన మలుపు తిరిగింది. సరదాగా తన గ్రామీణ నేపథ్యం యాసలో మాట్లాడుతూ న్యూడిల్స్ ఆస్వాదిస్తున్న వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడమే కాదు ఆమె సోషల్ మీడియా అకౌంట్‌కి మిలియన్ల కొద్ది చైనా ఫాలోవర్లు సంపాదించుకుంది. వ్యవసాయ కుటుంబ జీనవ విధానం, అలాగే ఆ గ్రామంలో లభించే స్థానిక ఉత్పత్తులు వాటికి సంబంధించిన వీడియోలతో చైనా ప్రజలకు మరింత చేరువైంది.
దాంతో ఆమె విశాల హృదయానికి వేలాదిమంది అభిమానులుగా మారడమే గాక ఆమె వీడియోలకు మంచి క్రేజ్ పెరిగింది. అలా తన వీడియోలకు వీరాభిమాని అయినా లియు జియావోషుయ్ అనే అతడిని కామన్ స్నేహితుల ద్వారా కలుసుకుంది. అలా పరిచయమైన అతడు కాస్త ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు. ఈ నెల సెప్టెంబర్ 17న వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. అంతేగాదు,ఫ్యాన్ ఆన్‌లైన్‌లోక్రేజ్ తగ్గకుండా ఉడేలా ఆమె వీడియోలను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే పనుల తోపాటు ఆమె తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు.
అందుకోసమే తన జాబ్‌ని కూడా వదిలేసుకున్నాడు లియు. మరో విశేషం ఏంటంటే ఆ దంపతులు అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాదు అలంకరణ కోసం సముద్ర నేపథ్య అంశాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే తన భార్య ఫ్యాన్ ఇంతవరకు సముద్రాన్నే చూడలేదన్న ఉద్దేశ్యంతో అట. ఈ సందర్భంగా పాక్ మూలాలున్న చైనా అమ్మాయి ఫ్యాన్‌కి అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్తడమే కాకుండా వారి పూర్తి మద్దతును అందించారు. పైగా ఫ్యాన్ అబిమానులు తామెంతో ముద్దుగా పిలచుకునే "ఫెయిరీ టేల్ ప్రిన్సెస్" (రాకుమారి)ని యువరాణిలా చూసుకోవాలని లియుకి నొక్కి చెప్పడం విశేషం. ఈ స్టోరీ.. మన బ్యాగ్రౌండ్ ఎలాంటిదైనా..మన టాలెంట్, కష్టపడేతత్వంతో మన ఉనికిని చాటుకునేలా బతకొచ్చని ప్రూవ్ చేసింది ఈ అందమైన టీనేజర్.