
‘ఆరోగ్య భాగ్యానికి ఎవరూ దూరం కాకూడదు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం మన బాధ్యత’ అంటారు నగరవాసి సందీప్ జంగాల. ఆయన మాజీ ఐటీ ప్రొఫెషనల్, అండర్–19 క్రికెటర్(సౌత్ జోన్) కూడా అయిన సందీప్.. ఫొటో జర్నలిజంలో డిగ్రీ చేసిన డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్ కూడా.. సమాజానికి తనవంతుగా మంచి చేయాలనే తపనతోనే మిల్లెట్ ఉత్పత్తులను సృష్టించానని అంటున్న దేశంలోని తొలి మిల్లెట్ కేఫ్ యమ్మీ బీని ఏర్పాటు చేసిన సందీప్ సాక్షితో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
క్రికెట్‌తో మొదలైంది..
మాది విజయవాడ.. చిన్నప్పటి నుంచీ చదువుతో పాటు క్రికెట్‌లోనూ కెరీర్‌ను మలచుకున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సౌత్ జోన్‌కు నేను ఆడే సమయంలో (2006–2007) అజయ్ జడేజా, ఆర్ అన్, దినేష్ కార్తీక్, రాబిన్ ఉతప్పలు నా సమకాలికులు. రాబిన్ సింగ్ మా కోచ్.. అయితే గాయం కారణంగా నాకెంతో ఇష్టమైన క్రికెట్‌కు దూరమవడం నాకు ఫిట్‌నెస్‌పై, అదే విధంగా ఓ పోషకాహార నిపుణుడు నా చిరుతిండి అలవాట్లపై చెప్పిన విషయంతో ఆరోగ్యకర ఆహారంపై అవగాహన వచ్చింది.
ట్రాన్స్‌ఫార్మ్.. ఫిట్‌నెస్..
ఆరోగ్యంగా ఉండు.. ఆరోగ్యం పంచు అనేదే ఆలోచన. క్రికెట్‌కు దూరమయ్యాక మన టాప్ సెలబ్రిటీల ఫిట్‌నెస్ ట్రైనర్ల శిక్షణను సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తూ ట్రాన్స్‌ఫార్మ్ ఫిట్‌నెస్ అనే ఆన్‌లైన్ వేదిక ఏర్పాటు చేశాను. అది బాగా విజయవంతం అయ్యింది. ఆ తర్వాత దానిని అపోలో గ్రూప్ సొంతం చేసుకుంది. ఆ క్రమంలో కొంత కాలం అపోలో గ్రూప్‌లో మంచి జీతంతో పనిచేశాను కూడా..
యమ్మీగా.. హెల్దీగా..
ఏదైనా చాక్లెట్, పేస్ట్రీ.. తింటూ యమ్మీ యమ్మీ అని పిల్లలు ఆనందిస్తారు. మరి ఆరోగ్యం మాటేమిటి? మా అమ్మాయి విషయంలో పుట్టిన ఈ ఆలోచనే నా చేత యమ్మీ బీ అనే బ్రాండ్‌కు రూపకల్పన చేయించింది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం అంటే పిల్లలు ముఖం చిట్లించేలా ఉండకూడదని సంవత్సరాల తరబడి పరిశోధన చేసి మెనూ రూపొందించాం.
మా ఉత్పత్తులు పూర్తిగా చక్కెర, మైదా, గ్లూటెన్ రహిత రసాయన రహితమైనవే అయినా రుచిలో ఏ మాత్రం వ్యత్యాసం కనిపించదు. మిల్లెట్లతో డెజర్ట్‌లను తయారు చేయడం సాధ్యమేనా అని కొందరు సందేహించారు. మేం డిజర్ట్స్ మాత్రమే కాదు పాస్తా సైతం మిల్లెట్‌తో తయారు చేశాం. క్లౌడ్ కిచెన్‌గా ప్రారంభమై నగరవ్యాప్తంగా అరడజను కేఫ్స్‌కి విస్తరించాం అని చెప్పుకొచ్చారు సందీప్ జంగాల
(చదవండి: లిపోప్రొటీన్(ఎ)తో గుండెకు ప్రమాదం..!)