దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తీ రోజుకు ఒక మిల్లెట్ భోజనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘వన్ మిల్లెట్ మీల్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ ఇండివీడ్యువల్’ అనే జాతీయ మిషన్‌లో భాగంగా మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బేగంపేట ఎస్‌జే ఫారŠూచ్యన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని వివిధ కార్పొరేట్ ఆఫీసులను శిక్షణ పొందిన ‘మిల్లెట్ మదర్స్’తో అనుసంధానం చేసి, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన మిల్లెట్ భోజనాలను అందించనుంది.
ఈ కార్యక్రమం మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్, ఎంబీఎఫ్ (మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్) సంయుక్తంగా నిర్వహించిన మిల్లెట్ మదర్స్ ప్రోగ్రాంకు కొనసాగింపుగా ప్రారంభించారు. ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటి లయ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 100 మంది మిల్లెట్ మదర్స్‌కు శిక్షణ ఇచ్చారు. వీరు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 20కి పైగా మిల్లెట్ వంటకాలు తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించారు.
ఈ శిక్షణను నేషనల్ మిల్లెట్ కోచ్ పూజా లకోటియ ఆధ్వర్యంలో డాక్టర్ మోనికా శ్రవంతి, డాక్టర్ గిరిధర్, మిల్లెట్ మదర్స్ కో–ఆర్డినేటర్ మాధురి సహకారంతో నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే బాగా ఆలోచిస్తారు, పనిచేస్తారు, జీవిస్తారని ఎంబీఎఫ్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ సరకడం అన్నారు. మిల్లెట్ మదర్స్ కార్యక్రమం ద్వారా అందించే ప్రతి భోజనం మహిళలను శక్తివంతం చేస్తుందని తెలిపారు.
(చదవండి: భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!)


