మన దేశంలోని యోగా వైభవానికి ఎంతో మంది విదేశీయులు ఆకర్షితులయ్యారు. అది నేర్చుకునేందుకు భారత్‌కి వచ్చి స్థిరపడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు విదేశీయులు తమ మాతృభూమిలో దాని గొప్పతనం తెలిపేలా కృషి చేస్తున్నారు. అలాంటి యోగ గొప్పతనాన్ని తెలుసుకుని, అది నేర్చుకున్న తర్వాత పొందిన అనుభవం గురించి షేర్ చేసుకున్నాడు ఓ జపనీస్ వ్యక్తి. అతడి మాటలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.
భారత్‌లో నివశిస్తున్న జపనీస్ భారతీయుడు నోజోము హగిహర ఒక శక్తిమంతమైన పాఠాన్నినేర్చుకున్నానంటూ భ్యావోద్వంగంగా మాట్లాడిన వీడియోని నెట్టిట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. తత్వం ఆంతర్యం తెలుసుకునేందుకు ఉపకరించే ధర్మ యోగా గురించి మాట్లాడాడు ఆ వీడియోలో. ఇది మనిషి ఎలా జీవించాలో..ఎలా ఉంటే మంచిది అనేది తెలియజేస్తుంది.
యోగ సూత్రాలైన యమ(నిగ్రహం), నియమ(క్రమశిక్షణ)లు నిజాయితీ, కరుణ, క్రమశిక్షణలతో పాతుకుపోయిందని చెబుతున్నాడు. ఇది జీవన విధానం గురించి తెలుపుతుంది. అహింస, సత్యం, స్వీయ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు పోస్ట్‌లో ఈ యోగా అహింస, సత్యం, నిజాయితీ, దొగతనం చేయకుండా ఉండటం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నాడు.
బ్రహ్మచర్యం, మిత సంభాషణ, శారీరక, మానసిక శక్తిని బలోపేతం చేయడమే కాదు, దురాశను, దక్కని దానియందు బాధ వంటి వాటిని దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యోగా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసిందంటూ భావోద్వేగంగా మాట్లాడాడు నోజోము. దీనికి దయతో జీవించే ఆర్ట్‌ని నేర్పింస్తుందనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు.
(చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్)


