భర్త క్షేమం కోరి కర్వా చౌత్‌ ఉపవాసం ఉంటే..పాపం విధి మరోలా.. | Woman fasting for her husband On Karwa Chauth But She Collapsed | Sakshi
Sakshi News home page

భర్త క్షేమం కోరి కర్వా చౌత్‌ ఉపవాసం ఉంటే..పాపం విధి మరోలా..

Oct 13 2025 5:34 PM | Updated on Oct 13 2025 6:47 PM

 Woman fasting for her husband On Karwa Chauth But She Collapsed

"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అన్న పాటలానే  జీవితం ఉంటుంది. అప్పటి వరకు మనతో ఆడుతూ పాడుతూ సందడి చేసినవాళ్లు హఠాత్తుగా మనల్ని వదిలేసి వెళ్లిపోతే కచ్చితంగా ఠక్కున మన ఘంటసాలగారు పాడిన పాటల మదిలోకి వచ్చేస్తుంది. మనం ఒకటి అనుకుని సరదాగా గడిపితే విధి మరోలా మన కథ రాసేస్తుంటుంది. అలాంటి విషాద ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. 

ఈ దురదృష్టకర సంఘటన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌లోని బర్నాలాలో కర్వాచౌత్‌ వేడుకల సందర్భంగా తన భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంది 59 ఏళ్ల ఆశా రాణి. దక్షిణ భారతదేశంలో జరుపుకునే అట్లతద్ది మాదిరిగా జరుపుకునే పండుగే ఈ కర్వా చౌత్‌. అయితే ఈ కర్వాచౌత్‌ పండుగలో ఉపవాస విరమణ భర్తచేతుల మీదుగా జరుగుతుంది. 

ఆ నేపథ్యంలోనే ఈ ఆశారాణి అనే మహిళ కూడా భర్త క్షేమం కోరి ఉపవాసం ఉంది. అయితే ఈ వేడుకను ఆ రోజు(శుక్రవారం) సాయంత్రం స్నేహితుల ఇంటిలో జరుపుకోవాలని భావించి మనవరాలు, భర్తతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రుడి రాకకై నిరీక్షిస్తూ..అంతా సందడి సందడిగా గడిపారు. ఈలోపు నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేలా కాస్త ఆటపాటలు, నృత్యాలతో నిరీక్షిస్తున్నారు. 

ఈ ఆశారాణి కూడా అందులో భాగంగానే ఓ పాటకు వారందరితో కలిసి నృత్యం చేస్తూ..ఒక్కసారిగా కుప్పకూలిపోయింద. సకాలంలో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు దృవీకరించారు వైద్యులు. అప్పటిదాక ఆనంద సంతోషాలతో తేలియాడిన ఆ రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. 

భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి..ఆమెనే సుమంగళిగా మృత్యుఒడికి వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఇలాంటి ఘటనలు చూడగానే.. ఏ క్షణంలో ఏం జరగుతుందో ఎవ్వరికీ తెలియదు..విధి చాలా బలీయమైనది అన్న మాటలు స్పురణకు వస్తాయి కదూ..!. ..ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ..అప్పటి దాక ఆడిపాడి..మనముందే తనువు చాలిస్తే..ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేరెవ్వరూ..!. సో బీకేర్‌ఫుల్‌ ఇలాంటి విషయాల్లో..సదా అప్రమత్తంగా ఉండండి.

 

(చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్‌ పిక్నిక్‌కి అదే రూటు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement