
ఆ చిన్నారికి మూడున్నరేళ్లే.. అయినా టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అద్భుతంగా పాడుతోంది. ఆమె పాటలు వింటున్న గ్రామస్తులు చిన్నారిని అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం నర్సింహులపల్లెకు చెందిన ఆవునూరి సంజీవ్, మౌనిక కూతురు వరుణవి. టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అలాగే పాడుతుండడంతో తల్లిదండ్రులు రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
ఆమె ప్రతిభను గుర్తించిన ఓ ప్రైవేటు టీవీ నిర్వహించే ప్రోగ్రామ్‌కు ఆహ్వానించారు. ఆమె పాడిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సుమారు నాలుగు నెలలుగా ప్రోగ్రామంలో పాల్గొంటోందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..)