కారును లాగే కొండ.. ఎక్క‌డుందో తెలుసా? | Magnetic Hill on the Leh Kargil Highway full details | Sakshi
Sakshi News home page

Magnetic Hill: కారును లాగే కొండ

Jan 20 2026 7:49 PM | Updated on Jan 20 2026 7:58 PM

Magnetic Hill on the Leh Kargil Highway full details

ల‌దాఖ్‌లోని లేహ్‌–కార్గిల్‌ హైవేలో ఉన్న మేగ్నెటిక్‌ హిల్ ప్రాంతం అయస్కాంత శక్తికి ఒక ఎగ్జాంపుల్‌. ఇక్కడ రోడ్డుపై భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా వస్తువులు, వాహనాలు మూవ్‌ అవుతున్నట్టు మనం గమనించవచ్చు. కారును న్యూట్రల్‌ గేరులో పెట్టి స్టార్ట్ పాయింట్‌ దగ్గర ఆపితే, ఆటోమెటిక్‌గా కారు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కొండపైకి వెళ్తుంది.

మొదట్లో ఇది ఒక భ్రమలా, మాయలా అనిపించవచ్చు. కానీ అక్కడికి వెళ్లినవాళ్లకు ఇది నిజంగా జరిగే అద్భుతంలా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై చాలా మంది పరిశోధనలు కూడా చేస్తున్నారు. ప్రయాణికులకు మాత్రం ఇది ఒక గొప్ప అనుభూతిని అందించే ప్రదేశంగా మారిపోయింది.

హిడెన్‌ స్కీయింగ్ ప్యారడైజ్‌

బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒకటి. రిషికేష్‌ నుంచి బద్రినాథ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న జ్యోషిమఠం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన హిల్‌ స్టేషన్‌ (Hill Station) ఉంటుంది.

చలికాలంలో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఇష్టపడే వారికి ఔలి కంటే బెస్ట్‌ డెస్టినేషన్‌ ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా స్కీయింగ్‌ కోసం ఔలి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి నందాదేవి, కామెత్‌ వంటి హిమాలయ పర్వత శ్రేణులు అద్భుతంగా దర్శనమిస్తాయి. ఔలిలో ఒక ఆర్టిఫిషియల్‌ లేక్‌ కూడా ఉంది. చలికాలంలో ఈ సరస్సు చుట్టూ మొత్తం మంచు పేరుకుపోయి, ఈ ప్రదేశం మంచు స్వర్గంలా మారిపోతుంది. జ్యోషిమఠం నుంచి ఔలికి రోప్‌వే ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ ప్రయాణం మొత్తం హిమాలయాల అందాలను ఆస్వాదించేలా ఉంటుంది.

కుటుంబంతో కలిసి ఒక మంచి హిమాలయన్‌ అడ్వెంచర్‌ ట్రిప్ (himalayan adventure trip) ప్లాన్‌ చేయాలనుకుంటే, మీ లిస్టులో ఔలిని తప్పకుండా టాప్‌ 3 డెస్టినేషన్లలో చేర్చుకోవచ్చు. అలాగే జ్యోషిమఠంలో ఉన్న పాలరాయితో నిర్మించిన నరసింహ స్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. 

చ‌ద‌వండి: ఇక్క‌డ మ‌నుషుల‌ను తాకితే ఫైన్ వేస్తారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement