మంచి మేలు జాతి రకం గేదె, గుర్రం ధర మహా అయితే లక్షల విలువ పలుకుతాయ్ అంతే. ఎంతలా చూసినా..అంతకుమించి పలికే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ పశువుల సంతలో గుర్రం, గేదెల ధర వింటే..నోటమట రాదు. వింటుంది నిజమేనా అనే సందేహం కలుగక మానదు. మరి ఇంతకీ అదెక్కడ తెలుసుకుందామా..!.
రాజస్థాన్‌లో జరిగే వార్షిక పుష్కర్ పశువుల సంతలో ఈ వింతను చూడొచ్చు. ఇక్కడ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పశువులు కనిపిస్తాయి. దీన్ని తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలివస్తుంటారట. ఈ ఏడాది ఒక గుర్రం, గేదె ఖరీదు ప్రకారం..చాలా హైలెట్‌గా నచ్చాయి.
ఈ ఉత్సవంలో షాబాజ్ అనే గుర్రం ఏకంగా రూ. 15 కోట్లు ధర పలికింది. రెండున్నర ఏళ్ల ఈ గుర్రం ఇప్పటికే పలు ప్రదర్శనల్లో గెలుపొందిందట. ప్రతిష్టాత్మక మార్వారీ జాతికి చెందన ఈ గుర్రాన్ని కొనుగోలు చేస్తామంటూ.. రూ. 9కోట్లు నుంచి రూ. 15 కోట్ల వరకు ఆఫర్లు వచ్చాయని చెబుతున్నాడు సదరు యజమాని. అంతేకాదండోయ్ ఈ గర్రం పెంపకానికే దగ్గర దగ్గర రూ. 2 లక్షలు దాక ఖర్చు అవుతుందట.
ఆ తర్వాత అందరీ దృష్టిని ఆకర్షించిన మరో జంతువు అన్మోల్ అనే గేదె. దీని ధర సుమారు రూ. 23 కోట్లు పైనే పలుకుతుందని సదరు యజమాని చెబుతున్నారు. ఇది రాజకుటుంబానికి చెందినదట. దీనికి ప్రతిరోజు పాలు, దేశీ నెయ్యి, డ్రైఫ్రూట్స్ వంటి ప్రత్యేక ఆహారం పెడతాడట యజమాని. ఇక పశువుల ఫుష్కర ఫెయిర్‌లో వీటితోపాటు రాణ అనే గేదె రూ. 25 లక్షలు పలకగా బాదల్ అనే మరో ఛాంపియన్ హార్స్ రూ. 11 కోట్లు వరకు పలుకుతుండటం విశేషం. కాగా, ఈ పుష్కర్ ఫెయిర్ అనేది రాజస్తాన్ పశుసంవర్ధకానికి సంబంధించిన సంప్రదాయ వేడుక.
ఈ కార్యక్రమంలో ఉత్తమ జాతి పశువులను ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేస్తారు. అలాగే ఈ వేడుకలో ఉత్తమ ఏ2 పాలను ఉత్పత్తి చసే గిర్ ఆవులకు ప్రత్యేక స్థానం ఇస్తారట. ఇక ఈ రాజస్థాన్‌లో నాగౌర్ ఎద్దుల పోటీ ఈ వేడుక కంటే ప్రధాన ఆకర్షణగా ఉండటమే గాక సందర్శకుల తాకిడి కూడా అత్యధికమేనని చెబుతున్నారు స్థానికులు. ఈ వేడుక అక్టోబర్ 23 నుంచి మొదలై, నవంబర్ ఏడు వరుకు జరుగుతుందట. అయితే ఈ ఏడాది వేడుకలో ఇప్పటివరకు సుమారు మూడు వేల పైనే ఉత్తమ పశువులుగా ఎంపికవ్వడం విశేషం.


