
వండర్ వరల్డ్
మంచు నిండిన ఊరు
హిమాచల్ ప్రదేశ్ స్పిటి వ్యాలీలోని కోమిక్ గ్రామం గురించి విన్నారా? సంవత్సరంలో కొన్ని రోజులు తప్ప ఇక్కడ ఎప్పుడూ మంచే ఉంటుంది. ఇక్కడ ఎంత మంది నివశిస్తారో తెలుసా? కేవలం 130 మంది. వారిలో 90 మంది పురుషులు, 40 మంది స్త్రీలు. మన దేశంలో అత్యంత తక్కువ జనాభా ఉన్న కొండ పల్లె ఇదే.
సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉండే కోమిక్ ఆకాశాన్ని తాకే ఎత్తులో, చుట్టూ తెల్లటి హిమకొండలతో, పచ్చిక బయలను తనలో నింపుకుని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో మైమరిపిస్తుంటుంది. ఇది బౌద్ధ సంప్రదాయాలకు నెలకొలుపు. ఇక్కడి తంగ్యుద్ మఠం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం సాక్య సెక్ట్‌కు చెందినది. మాత్రే బుద్ధ (ఫ్యూచర్ బుద్ధ) విగ్రహన్ని కలిగిన ఏకైక ్ర΄ాంతం ఈ కోమిక్. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తెరిచే రహస్య భాండాగారాలైన డ్రాగన్ గుడ్డు, యూనికార్న్ శృంగం వంటి అద్భుతాలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మఠం భారతదేశంలోని అత్యంత ఎత్తైన మఠాల్లో ఒకటి. (5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!)
కోమిక్ కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ప్రకృతి ప్రేమికులకి ఇదొక స్వర్గం. హిమాలయాల మధ్య హైకింగ్ చేస్తూ, ఫాసిల్స్ శోధిస్తూ, స్థానిక యాక్ మిల్క్ టీ సిప్ చేస్తూ, గ్రామస్తుల ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చు. స్పిటియన్ వంటకాలు, బటర్ టీ రుచి చూడటం ఒక అద్భుత అనుభవం. ఢిల్లీ నుండి మనాలీ లేదా షిమ్లా మీదుగా 700–800 కి.మీ. ప్రయాణించి కాజా నుండి ఒక గంటలో కోమిక్ చేరుకోవచ్చు. మే నుండి సెప్టెంబర్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం. ఎందుకంటే శీతాకాలంలో మంచు రోడ్లను కప్పివేసి ప్రయాణాన్ని జటిలం చేస్తుంది. కోమిక్ ఒక అద్భుత ప్రపంచం. ఇక్కడ గడిపే ప్రతి క్షణం జీవితానికి ఒక మధురా నుభూతిని ఇస్తుంది.
ఇదీ చదవండి : స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్‌పాట్