
ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకు వచ్చిన ఫోన్ కాల్, ఏ స్పామ్ కాలో, స్కామ్ కాలో అనుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క క్షణంలో మెటా లాటరీ మిస్ అయ్యిపోయేదే. ఆ తరువాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. విషయం ఏమీ అర్థం కాలేదు. అసలు సంగతి తెలియాలంటే.. ఈ కథనాన్ని చదవాల్సిందే.
మిచిగాన్‌లోని వెస్ట్‌ల్యాండ్‌కు చెందిన 65 ఏళ్ల మహిళ వాలెరీ విలియమ్స్ తనకు లాటీరలో అదృష్టం వరిస్తుందేమో ఆశ ఉన్నా.. కచ్చితంగా తనకు కోట్ల రూపాయల అదృష్టం వరించబోతోందని మాత్రం అస్సలు ఊహించలేదు. అందుకే ఫోన్ కాల్ రూపంలో వెతుక్కుంటూ వచ్చిన లక్‌ను స్కామ్ అనుకుంది. నిజానికి ఆ ఫోన్ కాల్ వాస్తవానికి జీవితాన్ని మార్చే వార్త అని తెలుసుకుని షాక్ అయ్యింది. మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్‌అవేలో తనను పోటీదారుగా ఎంపిక చేశారని తెలుసుకుని షాక్ అయింది విలియమ్స్.
కట్ చేస్తే విలియమ్స్ మిలియన్ డాలర్ల (రూ.8.8 కోట్లు బహుమతిని గెలుచుకుంది. ఇన్నేళ్లుగా రాని అదృష్టం ఇంకేమి వస్తుంది అనుకుంది. కానీ అనూహ్య విజయం అవాస్తవంగా అనిపిస్తోందంటూ సంతోషం వ్యక్తం చేసింది.
చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!
సెప్టెంబర్ 19న డెట్రాయిట్‌లోని కొమెరికా పార్క్‌లో బహుమతి చక్రం తిప్పడానికి ఆహ్వానించారని ఈ స్పిన్ ఆమెకు ఈ బహుమతిని సంపాదించిపెట్టింది.కొమెరికా పార్క్‌లో భారీ జనసమూహం మధ్య ఎలక్ట్రిక్ ఫ్యామిలీ గివ్‌అవే విజేత వాలెరీ విలియమ్స్‌కు అభినందనలు అని లాటరీ కమిషనర్ సుజన్నా ష్క్రెలి అనౌన్స్ చేసేదాకా నమ్మలేదని..ఇప్పటికీ షాక్‌లో ఉన్నాను అని తెలిపింది విలియమ్స్. గెల్చుకున్న డబ్బును ఏం చేయాలనే పెద్ద ప్లాన్లు ఏవీ ప్రస్తుతానికి లేక పోయినా, భర్తతో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళతానని, మిగతాది పొదుపు చేసుకుంటానని తెలిపింది.
మిచిగాన్ లాటరీ యాప్ ద్వారా తాను గెలవని టిక్కెట్లను స్కాన్ చేయడం ద్వారా తాను రెండవ అవకాశం బహుమతిగా పొందుతున్నానని ఆమె గ్రహించలేదని మిచిగాన్ లాటరీ అధికారులు చెప్పారు. చాలా మంది విజేతలు రెండో అవకాశాన్ని పట్టించుకోరనీ, కానీ తమ ఖాతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అధికారిక నోటిఫికేషన్ల కోసం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు.