
ఒక్కోసారి మనం చేసే పనులు ఎంత సీరియస్‌గా మారుతాయో అనేందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. బహుశా అందుకే కాబోలు ఏ పనైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని అంటుంటారు పెద్దలు. ఈ ఘటన వింటే..ఎంత జాగురకతో ఉండాలో కచ్చితంగా అర్థమవుతుంది.
అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియాలో జరిగిన ఒక వింత ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడమే కాదు, అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అసలు ఇలా ఎలా జరిగిందని..అనుమానాలు లేవనెత్తేలా చర్చనీయాంశమైంది. ఒక మహిళ ప్రమాదవశాత్తు భవనానికి నిప్పంటిచడంతోనే ఈ ఘటన వార్తలో నిలిచింది.
కేవలం బొద్దింకను చంపేందుకు ఫ్లేమ్ త్రోవర్(మండే స్ప్రే)ని ఉపయోగించడంతోనే ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆమె బొద్దింకను చంపేందుకు ఎప్పుడైతే ఫ్లేమ్ త్రోవర్ ఉపయోగించిందో..ఆ మంటలు కాస్త వంటగదిలో ఉన్న వస్తువులకు వ్యాపించి..మొత్తం 32 అపార్ట్‌మెంట్‌ల రెసిడెన్సీ మంటల్లో చిక్కుకుపోయింది. రెండు నెలల శిశువుతో అదే ఫ్లోర్‌లో పొరుగున ఉన్న ఒక జంట ఈ ప్రమాదంలో చిక్కుకుపోయింది. పాపం వారు తమ బిడ్డను కాపాడుకునేందుకు పక్కంటి వారికి శిశువుని అప్పగించి కిటికీ గుండా తప్పించుకోవాలనుకున్నారు.
ముందు భర్త బయటకు రాగా, ఆయన్నే అనుసరిస్తు వస్తున్న చైనాకు చెందిన మహిళ పట్టు తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. తీవ్ర గాయలపాలై మరణించిందామె. అంతేగాదు ఈ మంటలు గ్రౌండ్‌ఫ్లోర్‌లో వాణిజ్య యూనిట్లు, అక్కడే నివాసం ఉంటన్న కొన్ని కుటుంబాలు కూడా ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రమాదం కారణంగా ఎనిమిదిమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఈ దుర్ఘటనకు కారణం సదరు మహిళ నిర్లక్ష్యమే అంటూ ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. పాపం ఏదో బొద్దింకల బెడద వదిలించుకోబోయి..చివరికి జైలుపాలై పరిస్థితి ఎదురైంది. ఏదో చేయిబోయి..ఇంకేదో అయినట్లు పాపం ఆ మహిళ ఒక్క బొద్దింకను మట్టుబెట్టాలనుకుంటే..ఓ ప్రాణాన్ని పొట్టనుబెట్టుకోవడం, పలువులరు గాయపడటానికి దారితీసింది.
(చదవండి: క్యాబ్ డ్రైవర్‌గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..)