
అపురూపమైన అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి పారిస్ నగరంలో ఉన్న ఐఫిల్ టవర్. జీవితంలో ఒక్కసారైనా దీన్ని చూడాలని ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు. ముఖ్యంగా ప్రేమ పక్షులకు ఇది ఫ్యావరెట్ డెస్టినేషన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే దీనిని ప్రౌడ్ ఆఫ్ ఫ్రాన్స్ అని కూడా పిలుస్తారు. దశాబ్దాలుగా ఐఫెల్ టవర్ తన అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.
అయితే 136 సంవత్సరాల చరిత్రలో, ఈ స్మారక చిహ్నం అనేక సందర్భాల్లో మూతపడింది. సమ్మెలు , కార్మికుల నిరసనలు, భద్రతా ఆందోళనలు, 2024 ఒలింపిక్స్ సందర్బంగా, కోవిడ్ మహమ్మారి. 2015, పారిస్ ఉగ్ర దాడులు, కత్తిపోట్లు, సందర్భంగా ఐకానిక్ ఐఫిల్ టవర్‌ను మూసివేశారు.
తాజగా ఫ్రాన్స్ అంతటా వేలాది మంది కార్మికుల ఆందోళన, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఐకానిక్ ఐఫిల్ టవర్ ప్రస్తుతం మూతపడింది. అక్టోబర్ 2న దీన్ని మూసివేశారు.
ఎపుడెపుడు మూత పడిందంటే!
2015, నవంబర్ పారిస్‌లో ఉగ్రదాడులనేపథ్యంలో మూసివేశారు.
2017లో కత్తి దాడి: ఆగస్టు 2017లో, పర్యాటకులు , భద్రతా దళాల ముందు ఒక వ్యక్తి కత్తితో హల్‌చల్ చేయడంతో మూసివేశారు.
ఆగస్టు 2018: సిబ్బంది వాకౌట్: ఆగస్టు 2018లో, సందర్శకుల నిర్వహణలో మార్పులకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె కారణంగా ఐఫెల్ టవర్‌ను రెండు రోజులు మూసి వేయాల్సి వచ్చింది.
2019, మేలో : ఒక వ్యక్తి ఐపిల్ టవర్‌పై ఎక్కుతున్నట్లు కనిపించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అధికారులుఐఫిల్ టవర్‌ను ఖాళీ చేయించారు.
2020 కోవిడ్-19 మహమ్మారి: కోవిడ్-19 మహమ్మారివిస్తరణ, లాక్‌డౌన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నాల్లో భాగంగా దీన్ని మూసివేశారు.
ఘోరమైన కత్తిపోట్లు : డిసెంబర్ 2023 డిసెంబరులో ఐఫెల్ టవర్ దగ్గర ఒక జర్మన్ పర్యాటకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో దీన్ని ఉగ్రవాద దాడిగా భావించిన అధికారులు దీన్ని మూసివేశారు.
2024, ఫిబ్రవరి: సిబ్బంది సమ్మె కారణంగా ఐఫెల్ టవర్ మరోసారి మూసివేతను ఎదుర్కొంది. ఈసారి, నిర్వహణ ,సిబ్బంది సంక్షేమంపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. SETE అనే ఆపరేటర్ నిర్వహణ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తామని మరియు టిక్కెట్ ధరలను పెంచుతామని హామీ ఇచ్చినా సమ్మె కొనసాగడంతో, ఫిబ్రవరి 24 ఉదయం స్మారక చిహ్నాన్ని మూసివేశారు.
చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ఆగస్టు 2024: ఒలింపిక్స్‌కు ముందు : వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకకు కొన్ని గంటల ముందు, టవర్ ఎక్కుతూ ఒక దుండగుడు కనిపించడంతో ఐఫిల్ టవర్‌ను మళ్ళీ ఖాళీ చేయించారు. 3. ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలు
2024, సెప్టెంబర్‌లో: 2024 వేసవి ఒలింపిక్స్ తర్వాత, ఐఫెల్ టవర్ కొన్ని మార్పులకు గురైంది. ఈ క్రీడల కోసం30 టన్నుల ఒలింపిక్ రింగులను ఏర్పాటుచేశారు. వీటిని తొలగించేందుకు సెప్టెంబరులో ఒకసారి మూసివేశారు.
కాగా పారిస్‌లోని చాంప్ డి మార్స్‌పై 330 మీటర్ల ఎత్తులో లా డామ్ డి ఫెర్ (ఫ్రెంచ్‌లో "ఐరన్ లేడీ") ఐఫిల్ టవర్ కొలువు దీరింది. ఈ టవర్‌ను 1889 లో నిర్మించారు. 330 మీటర్ల పొడవైన ఈ టవర్ నిర్మాణానికి 70 లక్షల కిలోల ఇనుమును ఉపయోగించారు. 300 మంది కార్మికులు అందమైన భవనాన్ని 2 సంవత్సరాల 2 నెలల 5 రోజుల్లో పూర్తి చేశారని చెబుతారు.
చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్‌వీడియో