∙సమ్‌థింగ్ స్పెషల్
పుదుచ్చేరికి చెందిన పదకొండు సంవత్సరాల తారుగై ఆరాధన ‘అండర్ వాటర్’ భరతనాట్యంతో ఆహా అనిపించడమే కాదు, ప్లాస్లిక్ పొల్యూషన్ గురించి ప్రచారం నిర్వహిస్తోంది.
శిక్షణ ΄పొందిన భరతనాట్య నృత్యకారిణి అయిన ఈ చిన్నారి సర్టిఫైడ్ డైవర్ కూడా. సముద్రజీవులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కలిగించడానికి నీటిలో 20 అడుగుల లోతున డైవింగ్, భరతనాట్యం చేసింది ఆరాధన. పూర్తిగా సాంప్రదాయ దుస్తులు, అలంకరణతో ఆరాధన చేసిన నృత్యం ఆహా అనిపించింది.
శుభ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ అండర్ వాటర్ భరతనాట్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నృత్యాన్ని సముద్రాన్ని కాపాడుకునే మిషన్‌గా మార్చింది ఆరాధన’ అని ప్రశంసించింది శుభ. ‘చిన్న వయసులో ఆరాధన చేసిన సాహస నృత్యం అభినందనీయం’ అన్నారు నెటిజనులు.


