ఆఫీసులకు పాఠశాలలకు వెళ్లే వారు మధ్యాహ్న భోజనం కోసం రకరకాల లంచ్ బాక్సు ( lunch box) లను వాడుతుంటారు. రక రకాల డిజైన్లు, మోడల్స్‌లో మనల్ని ఆకర్షిస్తుంటాయి. అయితే వీటిలో ఏది సురక్షితం? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా?
ఆరోగ్యపరంగా చూస్తే గాజు పాత్రలు ఉత్తమం. ఎందుకంటే, గాజు వేడిని తట్టుకుంటుంది. ఆహారంలోని రసాయనాలతో ఇది చర్య జరపదు. భోజనం రుచిని, పోషకాలను గాజు పాత్రలు అలాగే కా పాడతాయి. శుభ్రం చేయడం కూడా సులభం.
స్టీల్ భేష్: రోజూ వాడుకోవడానికి స్టీల్ బాక్సులు అత్యంత అనువైనవి. ఇవి ఆహారంతో ఎలాంటి చర్యాజరపవు. దీనివల్ల విషపదార్థాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉండదు.
ఇత్తడి పాత్రలతో జాగ్రత్త: ఇత్తడి పాత్రలు చూడటానికి అందంగా ఉన్నా, లంచ్ బాక్సుల విషయంలో ప్రమాదం పొంచి ఉంది. ఇత్తడిలోని అంశాలు ఆహారంలో కలిసే అవకాశం ఉంది. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయి.
అల్యూమినియం అసలే వద్దు
తక్కువ ధర, తేలికగా ఉంటుందని అల్యూమినియంను ఎంచుకుంటారు. కానీ వేడి ఆహారం, నూనె పదార్థాలు, పులుపు వస్తువులతో అల్యూమినియం చర్య జరపడం వల్ల జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు రావడమే కాకుండా జ్ఞాపకశక్తి తగ్గడానికీ కారణమవుతుంది.
ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరం
వేడి పదార్థాలు వేసినప్పుడు ప్లాస్టిక్ కరిగి విషతుల్యంగా మారుతుంది. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
ఇదీ చదవండి: చిన్నారిని ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి, కాపాడిన డైపర్


