breaking news
Lunch boxes
-
Gujarat: పిల్లల బొమ్మల్లో, లంచ్ బాక్సుల్లో దాచి..
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అహ్మదాబాద్‌లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ. కోటికి పైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాలు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా, కెనడా, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్ల విలువైన హైబ్రిడ్, సింథటిక్ గంజాయి పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
లంచ్‌బాక్స్ కడగమనడంతో.. గంటసేపు ఆలస్యం
ఓ పైలట్ తన లంచ్‌బాక్స్‌ను కడగమని జూనియర్ సిబ్బందిని ఆదేశించడంతో పైలట్- సిబ్బంది మధ్య తీవ్ర వాదనకు తెర లేపింది. దీంతో బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం ఏఐ772 సోమవారం గంటకు పైగా ఆలస్యం అయింది. ఈ సంఘటన బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పైలట్ మరియు సిబ్బంది ప్రయాణికుల ముందే గోడవకు దిగారు. ఫలితంగా బెంగళూరు-కోల్‌కతా విమానం 77 నిమిషాలు ఆలస్యం అయింది. ఈ ఘటనపై వైమానిక సంస్థ వెంటనే చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియా ప్రతినిధి ఈ సంఘటనను 'ధృవీకరించి, ఈ విషయం దర్యాప్తులో ఉంది' అన్నారు. ‘కెప్టెన్లు తరచూ క్యాబిన్ సిబ్బందిని మెనియల్ ఉద్యోగాలు చేయమని నెట్టివేస్తారు. కెప్టెన్ మీ యజమాని అయినప్పుడు ఏమి చెప్పగలము. వారిపై ఫిర్యాదులు ఎటువంటి ప్రభావం చూపవు‘ అని క్యాబిన్ సిబ్బంది అన్నారు. -
‘హలో కర్రీ’... ఇన్వెస్టర్ల గురి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు. కోట్లల్లో జీతాలు. అయినా ఎక్కడో చిన్న లోటు. ప్రత్యేకత కోసం పాకులాట. మంచి వ్యాపార ఆలోచన తట్టగానే రంగంలోకి దిగడం. దేశ, విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టే స్థాయికి ఆ కంపెనీని తీసుకెళ్లడం. ఇదీ స్థూలంగా స్టార్టప్ కంపెనీల తీరు. ఇలా విజయవంతమైన వాటిలో హైదరాబాద్‌కు చెందిన హలో కర్రీ ఒకటి. ఇండియన్ ఫాస్ట్ ఫుడ్‌ను అందిస్తున్న ఈ సంస్థలో పెట్టుబడికి ఓ విదేశీ కంపెనీ సిద్ధమైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పెద్ద ఎత్తున విస్తరించేందుకు హలో కర్రీ సమాయత్తమవుతోంది. వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న వంటకాలను విదేశీ స్టైల్లో అందించే పనిలో నిమగ్నమైంది కూడా. ఇదీ హలో కర్రీ.. ఎవరైనా సరే సాధారణంగా లంచ్ బాక్సుతోపాటు ప్లేటు కూడా ఉండాల్సిందేనంటారు. తిన్నతర్వాత ప్లేటు కడగడం, తిరిగి బాక్సును సర్దుకోవడం పెద్ద పని. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేతిలో పట్టుకుని తినగలిగేలా ప్యాక్ చేసి ఆహార పదార్థాలను హలో కర్రీ సరఫరా చేస్తోంది. అదీ 30 నిముషాల్లోనే. ప్రస్తుతం మాదాపూర్‌కు 6-8 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సేవలందిస్తున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్న హలో కర్రీ డెలివరీ యూనిట్‌కు వెళితే రెండు నిముషాల్లో మెనూలో ఉన్న ఐటెమ్స్ రెడీ చేసిస్తారు. ఇందుకోసం కంపెనీ ప్రత్యేక తయారీ విధానాన్ని అనుసరిస్తోంది. రుచిలో ఇతర రెస్టారెంట్లతో ఏమీ తీసిపోమని మరీ చెబుతోందీ కంపెనీ. ఆసక్తికర విషయమేమంటే డెలివరీ యూనిట్లో చెఫ్ ఎవరున్నా రుచిలో తేడా రాదు. ఈ స్థాయిలో కంపెనీ ఏర్పాట్లు చేసుకుంది. బిర్యానీ, రైస్, చపాతీ, పరాటా, కర్రీస్, కబాబ్స్ ఇలా విభిన్న రకాల శాకాహార, మాంసాహార వంటకాలు అందిస్తోంది. ధర రూ.59 నుంచి ప్రారంభం. డెలివరీ ఉచితం. విభిన్న వంటకాలు..: కొన్ని వంటకాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. వాటికి మరింత ప్రాచుర్యం కల్పిస్తామని అంటున్నారు సందీప్ వర్మ. పలావ్ మాదిరిగా విలేజ్ బిర్యానీని పరిచయం చేస్తామని చెప్పారు. మన సంస్కృతిలో భాగమైన వంటకాలకు విదేశీ స్టైల్‌ను జోడించి తీసుకొస్తామని.. హైదరాబాద్‌లో విస్తరిస్తామన్నారు. ‘కొద్ది రోజుల్లో హలో కర్రీ యాప్ రానుంది. వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డరు ఇచ్చే విధానం పరిచయం చేస్తాం. స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానం, ఆర్డరును ట్రాక్ చేసే సౌకర్యమూ తీసుకొస్తాం’ అని చెప్పారు. ‘ట్రాఫిక్‌లో ఉన్నాం, ఫుడ్ పంపించండి అని ఎవరైనా అడిగినా సరఫరా చేస్తాం. సులభంగా తినగలిగేలా ప్యాకింగ్ ఉంటుంది’ అని తెలిపారు. కొత్త పెట్టుబడులు..: వెంచర్ క్యాపిటలిస్ట్ శశిరెడ్డి రూ.3 కోట్లు సీడ్ ఫండ్ కింద హలో కర్రీకి అందించారు. కొద్ది రోజుల్లో ఈయన కంపెనీలో బోర్డు సభ్యుడిగా రానున్నారు. ప్రముఖ విదేశీ సంస్థ ఒకటి ప్రైవేటు ఈక్విటీ(పీఈ)గా రూ.40 కోట్లు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. హైటెక్ సిటీ వద్ద రూ.75 లక్షల వ్యయంతో ఏర్పాటవుతున్న హెలో కర్రీ తొలి ఔట్లెట్ సెప్టెంబరులో ప్రారంభం కానుంది. టోలిచౌకి, అమీర్‌పేట్‌లో ఇటువంటి ఔట్లెట్లు రానున్నాయి. డెలివరీ యూనిట్లను గచ్చిబౌలి, శ్రీనగర్ కాలనీ, సికింద్రాబాద్‌లో ఒక్కొక్కటి రూ.20 లక్షల వ్యయంతో నెలకొల్పుతున్నారు. ఇవి కార్యరూపంలోకి వచ్చిన తర్వాతే ప్రైవేటు ఈక్విటీ స్వీకరించాలన్నది హలో కర్రీ ఆలోచన. అదనపు ఈక్విటీ నిధులు అందిన తర్వాత ఇతర నగరాలకు శరవేగంగా విస్తరించాలన్నది ఈ స్టార్టప్ కంపెనీ వ్యూహం. భారీ వేతనాన్ని వదిలి.. హలో కర్రీ వ్యవస్థాపకుల్లో రాజు భూపతి ఒకరు. భోపాల్ యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన 36 ఏళ్ల ఈ యువకుడు సీఎస్సీ అనే ఐటీ కంపెనీలో డెరైక్టర్ హోదా వరకు ఎదిగారు. యూఎస్, యూకే తదితర దేశాల్లో విధులు నిర్వర్తించారు. ఉద్యోగం వదిలే సమయానికి ఆయన వార్షిక వేతనం రూ.1.5 కోట్లు. సొంత వ్యాపారం చేయాలన్న తలంపుతో 2013 జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఆహారోత్పత్తుల సరఫరా రంగంలో పనిచేసిన సందీప్ వర్మతో పరిచయం కాస్తా హలో కర్రీ మొగ్గ తొడిగేలా చేసింది. 2013 డిసెంబరులో హలో కర్రీ నుంచి డెలివరీ ప్రారంభమైంది. ఇప్పుడు సంపాదిస్తున్నది అతి స్వల్పం కదాని అడిగితే సంతృప్తిని మించిన ఆదాయం లేదంటారు రాజు భూపతి. నా కంపెనీ, నా ఉద్యోగులు.. ఇంతకంటే ఏం కావాలని వినమ్రంగా చెప్పారాయన. కొద్ది కాలంలోనే 1.5 లక్షల మంది కస్టమర్లకు చేరడం గర్వంగా ఉందన్నారు. 35% మంది రిపీటెడ్ కస్టమర్లని తెలిపారు.