
ఈ ప్రకృతి ఆశ్చర్యంగొలిపే వింతలకు నెలవు. అందులోనూ పక్షులు గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పక్షి ఒక్కో ప్రత్యేకతతో అద్భుతం చేస్తుంటాయి. అలాంటి అందమైన పక్షుల్లో ఒకటి ఈ మనాకిన్ అనే ఎర్రటి టోపి పక్షి. వీటిని టోపీ పక్షులు అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం మనుషుల మాదిరిగా డ్యాన్స్ చేస్తుందని విన్నారా..?. అది కూడా బ్రేక్ డ్యాన్స్‌లకు పేరుగాంచిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌ని తలపించేలా అద్భుతంగా చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది.
ఆ వీడియోలో కోస్టారికాలో ఎర్రటి టోపీతో ఉండే మానకిన్ పక్షి అచ్చం మేఖేల్ జాక్సన్ చేసిన మూన్‌వాక్ డ్యాన్స్ మాదిరిగా నృత్యాన్ని ప్రదర్శించింది. దాని మ్యాజిక్ స్టెప్‌లు చూస్తే కళ్లుఆర్పడం మరిచిపోతాం. అంతలా కాళ్లు అద్భుతంగా కదుపుతోంది. ఇంతవరకు ఈ పక్షుల ఎర్రటి టోపీనే ప్రధాన ఆకర్షణగా ఉండేది. ఇప్పుడూ యూట్యూబర్ పీటర్ బాంబౌసెక్ షేర్ చేసిన వీడియో పుణ్యమా అని డ్యాన్స్‌కి పేరుగాంచిన పక్షులుగా పేరుగాంచుతాయేమో.
కాగా, ఈ పక్షులు దక్షిణ అమెరికాలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా బెలిజ్, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, నికరాగ్వా, పనామా వంటి దేశాల్లో కనిపిస్తాయి. అవి ఇలా నృత్యం చేసి ఆడపక్షులను ఆకర్షించి సంతానాన్ని పొందుతాయట. ఇంకెందుకు ఆలస్యం ఆ పక్షి అందమైన డ్యాన్స్‌పై మీరు ఓ లుక్కేయండి మరి..!..
(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)