సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని వాసులకు వాసులకు ఎయిర్ క్వాలిటీ మెనేజ్‌మెంట్ శుభవార్త తెలిపింది. అక్కడి వాయికాలుష్య తీవ్రత గతంతో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు పేర్కొంది. దీంతో గ్రేడ్-4 నేపథ్యంలో విధించే కఠిన ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది.
ఢిల్లీ నగరం తీవ్రమైన గాలికాలుష్య సమస్యతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గాలి నాణ్యత గత ఆదివారం 440కి చేరుకొని అత్యంతప్రమాదర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గ్రేడ్-4కు విధించే కఠిన ఆంక్షలు విధిస్తూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు ఉదయం గాలినాణ్యత 378గా నమోదైంది. దీంతో ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇచ్చింది.
అయితే గ్రేడ్-4 ఆంక్షల సమయంలో నగరంలో కఠిన ఆంక్షలు ఉంటాయి. నిర్మాణ రంగ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. అత్యవసరమైతే తప్ప డీజిల్ ట్రక్కులను నగరంలోకి అనుమతించరు. జనరేటర్లతో నడిచే పరిశ్రమలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సిపారసు చేస్తారు. కాగా సాధారణ సమయంలోనే వాయు కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో శీతాకాలంలో దాని ప్రభావం మరింత అధికంగా ఉంటుంది.


