ఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (జనవరి 26, సోమవారం) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీని నిఘా నీడలోకి తెచ్చారు. ఉగ్రముప్పు హెరేపు (జనవరి 26, సోమవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలుచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. కర్తవ్య పథ్‌లో ఏఐ (AI) పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్‌క్లోజర్‌లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. భద్రతను పటిష్టం చేసిన ఢిల్లీ పోలీసులు.. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను ఉపయోగించనున్నారు. అనుమానితులను గుర్తించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది.
చరిత్రలో తొలిసారిగా..
అన్ని సీసీటీవీ కెమెరాలను వీడియో అనలిటిక్స్, ముఖ గుర్తింపు వ్యవస్థలతో అనుసంధానించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ చరిత్రలో తొలిసారిగా పోలీసులు స్మార్ట్ గ్లాసెస్ ధరించి విధుల్లో పాల్గొంటారు. రద్దీని పర్యవేక్షించడంతో పాటు అనుమానితులను గుర్తిస్తారు. గడ్డం, జుట్టు పెంచినా, ముఖంపై గాయాలు ఉన్నా.. పాత, కొత్త ఫోటోల ఆధారంగా వ్యక్తులను గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. స్మార్ట్ గ్లాసెస్‌లో ఉండే కెమెరా మొబైల్ యాప్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇందులో దాదాపు 65,000 మంది నేరస్తుల డేటాబేస్ ఉంటుంది. ఎవరైనా నేరస్తుడు కనిపిస్తే ఈ పరికరం వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.
థర్మల్ స్కానింగ్:
ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వ్యక్తులు దాచుకున్న ఆయుధాలను, అనుమానాస్పద వస్తువులను కూడా గుర్తించవచ్చు. కేవలం ఢిల్లీ జిల్లాలోనే 10 వేల పోలీసులు, 3 వేల పైగా సీసీటీవీ కెమెరాలు, 30కి పైగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మూడు అంచెల తనిఖీలు నిర్వహించనున్నారు.
కాగా, జనవరి 26న జరగనున్న వేడుకలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్’ (ఏక్యూఐఎస్)కు చెందిన మహమ్మద్ రేహాన్ అనే ఉగ్రవాది ఫోటోను తొలిసారిగా చేర్చడం గమనార్హం. రేహాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు.


