ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. ఢిల్లీలో రికార్డు | Cold Waves Across North India And Delhi, Records 13 Year Low Temperature And Dense Fog Disrupts Daily Life | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. ఢిల్లీలో రికార్డు

Jan 13 2026 9:26 AM | Updated on Jan 13 2026 9:56 AM

Cold Waves Across North India And Delhi

సాక్షి, ఢిల్లీ: శీతాకాలం చలి గాలులు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీనికి తోడు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మూడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ క్రమంలో ఢిల్లీలో 13 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైంది.

కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా కంటే ఢిల్లీలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. సిమ్లాలో 9 నుంచి 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఢిల్లీలో మాత్రం 3 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరికొన్ని రోజులపాటు తీవ్రమైన చలిగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

మరోవైపు.. చలి గాలుల కారణంగా ఉత్తరాదిలో అనేకచోట్ల సున్నా కంటే తక్కువ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో ఉంటున్నాయి. ప్రతాప్‌గఢ్‌ (రాజస్థాన్‌)లో ఇది మైనస్‌ 2 డిగ్రీలకు, బాడ్‌మేడ్‌లో మైనస్‌ ఒక డిగ్రీకి పడిపోయింది. అదే రాష్ట్రంలోని పిలానీ (1.2), సీకర్‌ (1.7), బీకానేర్‌ (1.9), చురు (2 డిగ్రీల సెల్సియస్‌) వంటివి వణికిపోతున్నాయి.

 

 పంజాబ్, హర్యానాల్లోనూ అనేకచోట్ల ఇది సున్నాగా ఉంది. అత్యంత చలి, పొగమంచు వల్ల నోయిడాలోని పాఠశాలలకు ఈ నెల 15 వరకు సెలవులు ప్రకటించారు. కశ్మీర్‌లో అత్యంత చలికాలం మొదలైంది. శ్రీనగర్‌లో మైనస్‌ 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొంది. మైనస్‌ 8.6 డిగ్రీల సెల్సియస్‌తో లోయలోనే అత్యంత శీతల ప్రాంతంగా శోపియాన్‌ నిలిచింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement