ఢిల్లీ: ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి చీకటి అలుముకుంది. వర్షం, పొగ మంచు కారణంగా ఢిల్లీలో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. భారత వాతావరణ విభాగం (IMD) ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, గాలివేగం గంటకు 40–60 కిమీ వరకు చేరే అవకాశం ఉంది.
పశ్చిమ దిశ నుండి వచ్చే వాతావరణంలో అవంతారాలు(వెస్ట్రన్ డిస్టబెన్స్) కారణంగా ఈ ఆకస్మిక వర్షానికి కారణమని ఐఎండీ స్పషం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో వర్షం, మంచు, చలి ఉంటుందని తెలిపింది. హిమాలయ పర్వత రాష్ట్రాలలో భారీ వర్షాలు, మంచు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. జనవరి 27 వరకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది.


