ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలలో జీరో విజిబులీటీ నమోదైంది. పొగమంచు తీవ్రంగా ఉండడంతో విమానాలతో పాటు పలు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు నగరంలో గాలికాలుష్య తీవ్రత సైతం మరోసారి పెరిగింది.
దేశరాజధాని నగరంలో గాలికాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం గాలి కాలుష్య స్థాయి 439 పాయింట్ల నుంచి 500 కు చేరుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం గ్రేడ్-4 కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు పొగమంచు దట్టంగా అలుముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
దీంతో విమాన రాకపోకల సమయాలు ప్రయాణికులకు వెబ్‌సైట్‌లలో చుసుకోవాలని ఇండిగోతో పాటు ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి.బేర్లీ, లక్నో, కుశీనగర్ ప్రాంతాలలో జీరో విజిబులిటీ నమోదుకాగా అమృత్ సర్, గోరఖ్‌పూర్‌లలో 100మీటర్లు, ప్రయాగ్‌రాజ్‌లో 200 మీటర్ల విజిబులిటీ నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.


