న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈయన సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్(ఎస్‌డబ్ల్యూఏసీ) కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. ఢిల్లీలోని వాయుభవన్‌లో జరిగిన∙కార్యక్రమంలో ఈయన బాధ్యతలు చేపట్టారు.
వైమానిక దళంలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సేవలందించిన ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ బుధవారం రిటైరవడంతో వైస్ చీఫ్ పదవి ఖాళీ అయ్యింది. 1986 ఐఏఎఫ్ బ్యాచ్‌కి చెందిన ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్‌కు వివిధ యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు నడిపిన అనుభవముందని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది.


