ఢిల్లీలో దోచుకున్న సైబర్ నేరగాళ్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏడాది కాలంలో సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1,250 కోట్ల డబ్బును అమాయకుల నుంచి దోచుకున్నారు. తాజాగా, ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతులను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఏకంగా రూ.15 కోట్ల వరకు దోచుకోవడం తెల్సిందే.
చైనా హ్యాండ్లర్ ఆదేశాల మేరకు కాంబోడియా, వియత్నాం, లావోస్‌లు కేంద్రంగా పనిచేస్తున్న నేరగాళ్లు 2024లో ఢిల్లీ వాసుల నుంచి రూ1,100 కోట్ల మేర కొల్లగొట్టారు. 2025కు వచ్చే సరికి ఈ మొత్తం రూ.1,200 కోట్లకు పెరిగిందని ఓ అధికారి తెలిపారు. అయితే, 2024లో రికవరీ 10 శాతం మాత్రమే ఉండగా, 2025కు వచ్చే సరికి ఇది 24 శాతానికి పెరగడం కాస్తంత ఊరట కల్గించే విషయమన్నారు. మోసం విషయం తెల్సిన వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన కోరారు.


