ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ

Ap Dgp Rajendranath Inaugurated Police Convention Center In Rajahmundry - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: గత ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన రాజమండ్రిలో పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయన్నారు.

‘‘శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు.
చదవండి: ఏపీ సర్కార్‌పై ఐరాస శాశ్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ బృందం ప్రశంసలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top