రాజమండ్రి ఫార్మ‌సీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్ | Ys Jagan Tweet On The Rajahmundry Pharmacy Student Incident | Sakshi
Sakshi News home page

రాజమండ్రి ఫార్మ‌సీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్

Apr 2 2025 8:02 PM | Updated on Apr 2 2025 8:14 PM

Ys Jagan Tweet On The Rajahmundry Pharmacy Student Incident

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఫార్మ‌సీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.

సాక్షి, తాడేపల్లి: రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఫార్మ‌సీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఫార్మ‌సీ విద్యార్థిని త‌ల్లిదండ్రులు ఈ రోజు న‌న్ను క‌లిశారు. త‌మ కుమార్తెకు జ‌రిగిన అన్యాయాన్ని, ప్ర‌స్తుత ప‌రిస్థితిని నాకు వివ‌రించారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

‘‘బాధ్యుల‌కు శిక్ష ప‌డేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చి త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని వారు కోరారు. విద్యార్థిని ప‌రిస్థితి ఆ త‌ల్లిదండ్రులు వివ‌రిస్తుంటే బాధ‌నిపించింది. ఈ ప్ర‌భుత్వం ఆడ‌బిడ్డ‌ల భ‌ద్ర‌త విష‌యంలో ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందో అర్థ‌మైంది. ఫార్మ‌సీ విద్యార్థిని కుటుంబ స‌భ్యుల‌కు పూర్తి న్యాయం జ‌రిగేలా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చాను’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement