సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40 వేల అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్స్‌ను ఆ పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి రాజా, వినయ్ తేజ వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు



గోదావరిలో పడవలను అలకరించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. సంబరాలు జరిపాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కక్ కట్ చేసి ఆ పార్టీ నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
కుంచనపల్లిలో..
తాడేపల్లి: కుంచనపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్‌ను కట్ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.



