ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ రయ్‌.. రయ్‌!

Greenfield road from Khammam to Rajahmundry - Sakshi

ఖమ్మం నుంచి రాజమండ్రికి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి 

ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర నిర్మాణం 

నిర్మాణం పూర్తయితే ఖమ్మం–రాజమండ్రి మధ్య దూరం తగ్గినట్టే..

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది భూసేకరణతో కలిపి రూ.4,609 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను ఖరారు చేయగా.. ఏలూరు జిల్లా పరిధిలో రూ.1,281.31 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు.

భారతీమాల ప్రాజెక్టులో భాగంగా మంజూరైన ఈ రహదారి నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణతో కాకినాడ పోర్ట్‌ అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్టు కీలకమైనదని కేంద్రానికి నివేదించి ఈ ప్రాజెక్ట్‌ మంజూరు చేయించింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల నుంచి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు రూ.711.94 కోట్లను కేంద్రం కేటాయించింది.
 
53 కిలోమీటర్లు తగ్గనున్న దూరం 
ప్రస్తుతం ఖమ్మం–రాజమండ్రి నగరాల మ­ధ్య దూరం 220 కిలోమీటర్లు. దీనిని 167 కి­లోమీటర్లకు తగ్గించడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూ­ర్తయితే ఖమ్మం–రాజమండ్రి మధ్య దూ­రం 53 కిలోమీటర్లు తగ్గుతుంది. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర జాతీయ ర­హ­దారి నిర్మాణం చేపడుతున్నారు.

ప్రస్తుతం ఖమ్మం నుంచి కల్లూరు మీదుగా వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి ఆంధ్రాలో జీలుగుమిల్లిలోకి ప్రవేశించి జంగారెడ్డిగూడెం నుం­చి కొయ్యలగూడెం గోపాలపురం, కొ­వ్వూ­రు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంటుంది. నూతనంగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ఖమ్మం, సత్తుపల్లికి దూరంగా రే­చ­ర్ల నుంచి నేరుగా ఆంధ్రాలోని చింతలపూడి మండలంలో ఎండపల్లి నుంచి రా«ఘవాపు­రం, రేచర్ల మీదుగా టి.నరసాపరం, గు­ర్వా­యిగూడెం  మీదుగా దేవరపల్లి రహదారిలో కలుస్తుంది.  

భూసేకరణ పూర్తి 
ఈ రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతోంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. 1,297 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్‌ కారిడార్‌గా ఈ రహదారిని  వర్గీకరించారు.   

గ్రీన్‌ఫీల్డ్‌తో జిల్లాకు  ఉపయోగం 
గ్రీన్‌ఫీల్డ్‌ రహదారితో మెట్ట ప్రాంతంలో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. ఆంధ్రా–తెలంగాణ మ«ధ్య నూత­న రహదారి వల్ల దూరం తగ్గడమే కాకుండా తెలంగాణ, కాకినాడ పోర్టు అనుసంధానానికి ఉపయోగపడుతుంది.   
–కోటగిరి శ్రీధర్, ఏలూరు ఎంపీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top