ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఇవాళ( బుధవారం, డిసెంబర్ 31) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 20, 668 కోట్ల రూపాయలతో రెండు హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాసిక్ సోలాపూర్ హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 19,142 కోట్ల రూపాయలతో 374 కిలోమీటర్ల సూరత్ చెన్నై హై స్పీడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. చెన్నై సూరత్ హై కారిడా నిర్మాణంతో 45 శాతం ప్రయాణ సమయం తగ్గనుంది. 31 గంటల నుంచి 17 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
చెన్నై సూరత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కర్నూల్ కడప మీదుగా జాతీయ రహదారి వెళ్లనుంది. చెన్నై పోర్టు, హజీరా పోర్టుకు కనెక్టివిటీ పెరుగనుంది. కొప్పర్తి, ఓర్వకల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లకు హై స్పీడ్ నెట్‌వర్క్ ఉపయోగపడనుంది. రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తికానుంది.
ఒడిశాలోని జాతీయ రహదారి 326 వెడల్పు, బలోపేతం కోసం రూ.1526 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024 జూన్ నుంచి రైల్వే, హైవే, మెట్రో, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12.6 లక్షల రూపాయల నిధులను కేబినెట్ కేటాయించింది. 43 రైల్వే ప్రాజెక్టుల కోసం 1,52,583 కోట్ల రూపాయలను కేటాయించింది. 24 జాతీయ రహదారుల నిర్మాణానికి 2, 18,312 కోట్ల రూపాయలు కేటాయించింది.
8 మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1,31,542 కోట్లు, నాలుగు ఏర్పాట్లు నిర్మాణానికి 7339 కోట్లు, మేజర్ పోర్టు నిర్మాణానికి రూ.1,45,945 కోట్లు, రెండు కొత్త రోప్ వేల నిర్మాణానికి రూ.6811 కోట్లు, మూడు హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.28,432 కోట్లు, 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు రూ.28, 602 కోట్లు, పీఎం ఆవాస్ యోజన కోసం 5,36,137 కోట్లను కేంద్రం కేటాయించింది.
వొడాఫోన్-ఐడియాకు ఉపశమనం
కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్-ఐడియాకు ఉపశమనం కల్పించింది. రూ.87,695 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.


