
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులోని వెదర్ టచ్ మసాజ్ సెంటర్‌పై ఆదివారం పోలీసులు దాడి చేశారు. దీనికి సంబంధించి నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపిన వివరాల గత కొంతకాలంగా ప్రియాంకా గార్డెన్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న భవనంలో నరేష్ స్వామి వెదర్‌టచ్ పేరుతో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు దాడి చేశారు. స్పా సెంటర్‌లో నలుగురు విటులు, ఆరుగురు బా«ధిత మహిళలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్పా సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్నింటిపై దాడులు చేస్తామని, త్వరలో మరిన్ని దాడులు చేయనున్నామని డీఎస్పీ శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలిపారు.