హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న సెల్ టవర్ ఎక్కి గంటకు పైగా కలకలం సృష్టించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని కిందకు దింపే యత్నం చేసినప్పటికీ అతను కిందకు దూకేశాడు. అయితే టవర్‌పై నుంచి దూకే క్రమంలో టవర్‌కు ఉన్న కడ్డీలు తగిలి కింద బురదలో పడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతను బిహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
అతన్ని కిందకు దింపే ప్రయత్నంలో భాగంగా పోలీసులు.. 108 అంబులెన్స్ సర్వీస్‌ను, డాక్టర్లను అక్కడ అందుబాటులో ఉంచారు. అయితే పోలీసు సిబ్బందిలో ఒకరు మెల్లగా పైకి ఎక్కి ఆ వ్యక్తిని కిందకు దింపే యత్నం చేశారు. అతన్ని పట్టుకుని పైకి లాగుదామనుకునేలోపే చేయి విదిల్చుకుని కిందకు దూకేశాడు ఆ బిహార్ వ్యక్తి. అసలు టవర్ ఎక్కి ఎందుకు దూకాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.


