వేద మంత్రోచ్ఛారణల మధ్య కొలువు దీరిన అతిపెద్ద సహస్ర లింగం | World's largest Shivling installed at Virat Ramayan Mandir Kesariya in Bihar | Sakshi
Sakshi News home page

వేద మంత్రోచ్ఛారణల మధ్య కొలువు దీరిన అతిపెద్ద సహస్ర లింగం

Jan 17 2026 6:55 PM | Updated on Jan 17 2026 7:12 PM

World's largest Shivling installed at Virat Ramayan Mandir Kesariya in Bihar

పట్నా: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కొలువుదీరింది బిహార్‌లోని  కేసరియాలోని విరాట్ రామాయణ మందిర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద 210 టన్నుల శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. 33 ఫీట్ల ఎత్తు, 210 టన్నుల బరువు ఉన్న ఆ శివలింగాన్ని తమిళనాడులో తయారు చేశారు. కొన్ని వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆ శివలింగం బిహార్‌కు చేరుకుంది.  

ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా  ఈ ఆలయం ఘనతను సాధించింది.  ఈ సహస్రలింగం శివలింగ ప్రతిష్టాపనలో కార్యక్రమంలో పలువురు పండితులు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, , ఉపముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, పలువురు ఇతర నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఈ పవిత్ర శివలింగాన్ని 17 అడుగుల మాలతో అ లంకరించడం విశేషం. సహస్రలింగం శివలింగంతో పాటు, విరాట్ రామాయణ ఆలయంలో 1072 దేవతలను కూడా ప్రతిష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగాన్ని దాదాపు 10 ఏళ్లుగా తమిళనాడులో ప్రత్యేకంగా రూపొందించారు.

20 కిలోల పూలమాల, 3250 కిలోల పువ్వులు

శివలింగ ప్రతిష్ఠాపనలో పువ్వులు, మారేడు ఆకులు, ఉమ్మెత్తతో చేసిన 20 కిలోల పూలమాలను పూజాదికాలతో శివలింగానికి సమర్పించగా, ఆలయ అలంకరణ కోసం 3250 కిలోల పువ్వులను ఉపయోగించారు. ఈ పువ్వులను కోల్‌కతా, కంబోడియా నుండి తీసుకువచ్చారు. శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన  21 మంది పూజారులు పూజలు నిర్వహించగా, వేదమంత్రోచ్ఛారణల మధ్య 1072 దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠాపన తర్వాత, నేల నుండి దీని ఎత్తు 56 అడుగులు ఉంటుంది. ఈ భారీ శివలింగాన్ని 96 చక్రాల ట్రక్కును ఉపయోగించి 45 రోజుల్లో తమిళనాడులోని మహా బలిపురం నుండి కైత్వాలియాకు తరలించారు.

రూ. 3 కోట్లు 
సహస్రలింగం శివలింగంలో 1008 చిన్న శివలింగాలు ఉన్నాయి, ఇది నల్ల గ్రానైట్ రాయితో తయారు చేయబడింది. అందుకే దీనికి సహస్రలింగం (అంటే "వెయ్యి శివలింగాలు") అని పేరు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మహావీర్ మందిర్ ట్రస్ట్ కమిటీ విరాట్ రామాయణ ఆలయాన్ని నిర్మిస్తోంది. పాట్నా హనుమాన్ ఆలయానికి చెందిన ఆచార్య కిషోర్ కునాల్ ఈ భారీ శివలింగం నిర్మాణాన్ని సంకల్పించారు ,ఇప్పుడు దాని ప్రతిష్ఠాపనతో ఆయన కల సాకారమైంది.

డీజీపీ స్పందన
ఈ కార్యక్రమం విజయవంతంపై  రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ, "పూర్తి భద్రతా ఏర్పాట్లతో  ఈ పుణ్యకార్యాన్ని పూర్తి చేసినట్టు  చెప్పారు. ఈ ఆలయం రాబోయే రోజుల్లో బిహార్‌లో మాత్రమే కాకుండా, ప్రపంచానికి ఒక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందుతుందని, ఈ సందర్భంగా కిషోర్ కునాల్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement